Jan 30, 2026 13:43 IST
చదువు అనేది గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
మనం మాత్రమే కాదు.. సమాజం కూడా బాగుండాలనేది మన సంస్కృతి: సీఎం చంద్రబాబు
చైతన్యం పెరిగి సేవా కార్యక్రమాలకు చాలా మంది సహాయం చేస్తున్నారు: చంద్రబాబు
ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుంది: సీఎం చంద్రబాబు
సరైన సమయంలో నిర్ణయాలు ఉండాలి: చంద్రబాబు
Jan 30, 2026 13:18 IST
అమరావతి: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: మంత్రి లోకేష్
పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేయండి: మంత్రి నారా లోకేష్
నేతల మధ్య సఖ్యత కూటమి.. కలిసికట్టుగా పనిచేయండి: లోకేష్
దుష్ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టండి: మంత్రి నారా లోకేష్
Jan 30, 2026 12:48 IST
కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS న్యాయవాది మోహిత్‌రావు
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే సిట్ నోటీసులు: మోహిత్‌రావు
గతంలో ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది: న్యాయవాది మోహిత్‌రావు
అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం: BRS న్యాయవాది మోహిత్‌రావు
Jan 30, 2026 12:47 IST
విచారణకు అడ్వకేట్‌ను పంపిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
క్రాస్ ఎగ్జామినేషన్‌కు వ్యక్తిగతంగా హాజరుకావడానికి..
ఫిబ్రవరి 20 వరకు గడువు కోరిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసిన మహేశ్వర్‌రెడ్డి
Jan 30, 2026 12:45 IST
కేసీఆర్‌కు మరోసారి నోటీసులు అందించిన సిట్ నిర్ణయం
నోటీసులు ఇచ్చే అంశంపై సిట్ అధికారుల భేటీ
కేసీఆర్‌ను హైదరాబాద్‌లోనే విచారించాలని సిట్ యోచన
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ప్రశ్నించే అవకాశాలు లేవంటున్న సిట్
Jan 30, 2026 12:44 IST
దానంపై అనర్హత వేటు వేయాలని కోరా: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చా: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
నాపై ఓవరాక్షన్ చేసిన అధికారులపై చర్యలు కోరా: కౌశిక్‌రెడ్డి
న్యాయం జరిగే వరకు అధికారులను వదిలిపెట్టను: కౌశిక్‌రెడ్డి
Jan 30, 2026 12:24 IST
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ స్వాత్ కమాండో కాజల్ చౌదరి దారుణ హత్య
భర్త అంకుర్ చౌదరి చేతిలో దారుణ హత్యకు గురైన కాజల్ చౌదరి
భార్యను హత్య చేస్తూ ఆమె సోదరుడికి ఫోన్ చేసిన నిందితుడు
హత్య అనంతరం శవాన్ని తీసుకెళ్లాలంటూ ఆమె సోదరుడికి చెప్పిన అంకుర్
అదనపు కట్నం కోసం వేధిస్తూ హత్య చేసిన భర్త అంకుర్ చౌదరి
Jan 30, 2026 12:17 IST
కరీంనగర్: వీణవంక మినీ మేడారం జాతరపై క్లారిటీ ఇచ్చిన నిర్వాహకులు
1976లో మా తాత పాడి సుధాకర్‌రెడ్డి మినీ మేడారం రూపం: ఉదయనందన్‌రెడ్డి
50 ఏళ్లుగా మా కుటుంబమే జాతర చేస్తుంది: ఉదయనందన్‌రెడ్డి
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కావాలనే గొడవ చేశారు: ఉదయనందన్‌రెడ్డి
జాతరతో ఎండోమెంట్‌కు సంబంధం లేదు: ఉదయనందన్‌రెడ్డి
Jan 30, 2026 12:15 IST
అహ్మదాబాద్‌లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ రోషన్ అగర్వాల్ సహా నలుగురి అరెస్ట్
అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు శిశువును తరలిస్తున్న ముఠా
వాహన తనిఖీల్లో బయటపడ్డ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా బాగోతం
శిశువును రూ.3.60లక్షలకు కొనుగోలు చేసిన ఏజెంట్ రోషన్
Jan 30, 2026 12:15 IST
ములుగు: మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు
రాత్రి పలుచోట్ల కరెంట్ పోవడంతో భక్తుల ఆగ్రహం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కారు అద్దాలు, పలు దుకాణాలు ధ్వంసం
Jan 30, 2026 12:14 IST
సస్పెండ్ చేస్తారని ఆశిస్తున్నాం: కౌశిక్‌రెడ్డి
దానం నాగేందర్‌ను స్పీకర్ సస్పెండ్ చేస్తారని ఆశిస్తున్నాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
దానం BRS నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు: కౌశిక్ రెడ్డి
దానం పోటీ చేసిన దాని కంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుంది?: కౌశిక్‌రెడ్డి
Jan 30, 2026 12:11 IST
దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ ఛాంబర్లో విచారణ
దానంపై అనర్హత కోరుతూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు
కౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన స్పీకర్
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ
కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న దానం అడ్వకేట్లు
తాను BRSలోనే ఉన్నానని ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన దానం
Jan 30, 2026 12:09 IST
జనవరి 30న భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి
మహాత్మా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు
మహాత్ముని త్యాగాలు, ఆశయాలను స్మరించుకుంటూ ట్వీట్ చేసిన సీఎం
అహింసా విధానంతో కోట్లమందిని ఒక్కతాటిపైకి తెచ్చిన మహాత్ముడు గాంధీ: సీఎం చంద్రబాబు
ఆయన బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్ధాంతాలు అందరూ పాటించాలి: సీఎం చంద్రబాబు
Jan 30, 2026 11:55 IST
మహాత్మకు నివాళి
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
మహాత్ముని త్యాగాలను, ఆశయాలను స్మరించుకున్న ముఖ్యమంత్రి రేవంత్
ఎక్స్ వేదికగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
Jan 30, 2026 11:48 IST
ఢిల్లీ: నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి
గాంధీజీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ
1948 జనవరి 30 న ఢిల్లీ బిర్లా భవన్ వద్ద నాథూరాం గాడ్సే చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన గాంధీ
జాతిపిత మహాత్మా గాంధీకి హృదయపూర్వక నివాళులు: మోదీ
పూజ్య బాపు ఎల్లప్పుడూ స్వదేశీని కోరుతున్నారు: ప్రధాని
గాంధీజీ వ్యక్తిత్వం, విజయాలు ఎల్లప్పుడూ విధి మార్గాన్ని అనుసరించడానికి సిద్ధం: ప్రధాని మోదీ
Jan 30, 2026 10:49 IST
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్
అమరావతి: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ సర్కార్
జాబ్ క్యాలెండర్‌పై కసరత్తు ముమ్మరం చేసిన కూటమి ప్రభుత్వం
వివిధ శాఖల వారిగా ఖాళీల వివరాలను సేకరిస్తున్న చంద్రబాబు సర్కార్
పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
Jan 30, 2026 10:21 IST
గుడ్ న్యూస్.. తగ్గుముఖం పట్టిన బంగారం ధర
కొన్ని రోజులుగా అంచనాలకు మించి పెరిగిన బంగారం ధర
నేడు ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే యూటర్న్ తీసుకున్న గోల్డ్ ధర
Jan 30, 2026 08:51 IST
స్నేహితుడిని అవమానించిన యువతి..
చిన్ననాటి స్నేహితుడు డెలివరీ బాయ్‌గా మారాడని అవమానించిన యువతి
దారుణంగా అవమానిస్తున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్
అప్పట్లో అందరూ బాగా చదువుకోవాలని చెప్పి ఇప్పుడు అతనే డెలివరీ బాయ్ అయ్యాడంటూ విమర్శ
వీడియో తీసి నెట్టింట పోస్టు చేసిన యువతి.. ఆమెపై ఫైర్ అవుతున్న నెటిజన్లు
Jan 30, 2026 08:22 IST
కేసీఆర్‌కు మరో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేడు మినహాయింపు
రేపు విచారణ కోసం మరో నోటీస్ సిద్ధం చేసిన సిట్
నోటీస్ ఎక్కడిస్తారనే దానిపై సందిగ్ధత
Jan 30, 2026 08:06 IST
పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్ సీపీని మతం పేరుతో దూషించారని కౌశిక్‌రెడ్డిపై కేసు
వీణవంకలో సమ్మక్క జాతరకు వెళ్తుండగా కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
సమ్మక్క జాతర దగ్గర పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కౌశిక్‌రెడ్డి
పోలీసులను నెట్టేసి.. సీపీపై అనుచిత వ్యాఖ్యలు
Jan 30, 2026 08:05 IST
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ప్రకాశం: అమ్మనబ్రోలు దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
పట్టాలు తప్పిన పక్క లైన్లపై పడ్డ గూడ్స్ వ్యాగన్లు
ఘటనాస్థలిలో కొనసాగుతున్న నిర్మాణాలు
నాగులుప్పలపాడు మం. అమ్మనబ్రోలు దగ్గర ఘటన
Jan 30, 2026 07:35 IST
దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 6.00 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,886
22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి రేటు రూ.1,63,960
విజయవాడ, విశాఖపట్నంలోనూ దాదాపు ఇదే రేటు
చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,83,290
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,68,010
Jan 30, 2026 07:30 IST
హైదరాబాద్: ఫిరాయింపుల కేసులో నేడు దానం నాగేందర్ విచారణ
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని రెండు పిటిషన్లు
పిటిషన్లు దాఖలు చేసిన కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వరరెడ్డి
కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న దానం అడ్వొకేట్లు
తాను BRSలోనే ఉన్నానని ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన దానం
Jan 30, 2026 07:28 IST
నేడే తుదిగడువు
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు నేడు తుదిగడువు
సాయంత్రం 5గంటలకు ముగియనున్న నామినేషన్ల గడువు
రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
Jan 30, 2026 07:28 IST
వెనెజువేలా గ్రీన్ సిగ్నల్..
చమురు రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు వెనెజువేల ఆమోదం
ప్రభుత్వానికి స్వస్తి, ఫలించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి
తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ సంతకంతో చట్టంగా మారిన బిల్లు
Jan 30, 2026 07:27 IST
మహాత్ముడి వర్ధంతి నేడే..
నేడు మహాత్మాగాంధీ ౭౮వ వర్ధన్తి
రాజ్‌ఘాట్‌లో నివాళులర్పనున్న రాష్ట్రపతి, ప్రధాని
Jan 30, 2026 07:24 IST
మేడారానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు
వనదేవతల దర్శనానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
అమ్మవార్ల దర్శనానికి 4గంటలకు పైగా సమయం
Jan 30, 2026 07:23 IST
నేడు తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు
సుప్రీం ఏర్పాటు కమిటీ ముందస్తు ఎన్నికలు
బరిలో 203 మంది న్యాయవాదులు, అందులో 55 మంది మహిళలు
తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లు 35,316 మంది న్యాయవాదులు
Jan 30, 2026 07:23 IST
చెన్నై: టీవీకే మేనిపెస్టో కమిటీ పర్యటన ఖరారు
ఫిబ్రవరి 1న మధురై నుంచి కమిటీ పర్యటన ప్రారంభం
ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక కార్యకర్తలతో భేటీ
ప్రజల అభిప్రాయాలను తీసుకోనున్న టీవీకే కమిటీ
ఫిబ్రవరి 2న టీవీకే మూడో వార్షికోత్సవం
Jan 30, 2026 07:22 IST
అనంతపురం: యాడికిలో గంజాయి బ్యాచ్ వికృత చేష్టలు
లిక్కర్ షాప్ దగ్గరకు అర్ధనగ్నంగా వచ్చిన గుత్తికి చెందిన రౌడీషీటర్ అజయ్ గ్యాంగ్
లిక్కర్ షాప్‌లో మద్యం కొని అక్కడే మద్యం సేవించిన రౌడీషీటర్ అజయ్ రాజు
యాడికిలో రౌడీషీటర్ అజయ్ వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సీరియస్
రౌడీషీటర్ అజయ్‌కు టీడీపీతో సంబంధం లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే జయరాం
రౌడీషీటర్ అజయ్ గ్యాంగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే జయరాం