ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్ | Andhra pradesh telangana national and international news andhrajyothy live updates of 1st february 2026 suri


  • ఫిబ్రవరి 01, 2026 9:56 PM IST

    BRS ఎమ్మెల్యేలతో ముగిసిన కేసీఆర్‌ సమావేశం

    • మున్సిపల్‌ ఎన్నికలపై చర్చించిన కేసీఆర్‌..

    • బరిలో రెబల్స్‌ లేకుండా చూసుకోవాలి..

    • ఎన్నికల్లో BRSకు మంచి ఫలితాలు వస్తాయి: కేసీఆర్‌

    • త్వరలో చాలా మంది BRSలో చేరతారు: మాజీ సీఎం కేసీఆర్‌

  • ఫిబ్రవరి 01, 2026 9:39 PM IST

    ఆర్థిక వ్యూహ పరీక్షలో విఫలం.. కేంద్ర బడ్జెట్‌పై చిదంబరం

    • కీలకమైన ఆర్థిక సవాళ్లను పట్టించుకోలేదు..

    • ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు..

    • ద్రవ్యలోటు, పన్ను మార్పుల్లో కూడా తేడా లేదు: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం

      పూర్తి కథనం..

  • ఫిబ్రవరి 01, 2026 9:31 PM IST

    కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

    • కేసీఆర్ అజేయుడు.. చిల్లర రాజకీయాలకు వణకడు: కేటీఆర్

    • ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్..

    • దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పర్వతంలా నిలబడిన మనిషి కేసీఆర్: మాజీ మంత్రి కేటీఆర్

      పూర్తి కథనం..

  • ఫిబ్రవరి 01, 2026 9:20 PM IST

    ఇప్పుడు పవర్ భారత్ చేతుల్లో: ఎలాన్ మస్క్

    • చిక్కుల్లో ఉన్న ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చైనా, భారత్‌లు చోదకశక్తులుగా మారాయి: ఎలాన్ మస్క్

    • పవర్ ఇప్పుడు చైనా, భారత్ చేతుల్లోకి వెళ్తోంది: ఎలాన్ మస్క్

      పూర్తి కథనం..

  • ఫిబ్రవరి 01, 2026 9:16 PM IST

    అండర్-19 ప్రపంచ కప్.. పాకిస్థాన్ ఓటమి..

    • అండర్ -19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్‌లో భాగంగా..

    • పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో టీమిండియా విజయం..

    • 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైన పాక్ జట్టు..

      పూర్తి కథనం..

  • ఫిబ్రవరి 01, 2026 8:52 PM IST

    జోగి రమేష్‌కు జగన్‌ ఫోన్‌..

    • జోగి రమేష్‌ నివాసంపై దాడిని ఖండించిన జగన్‌

    • ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు..

    • ప్రశ్నించేవారిని భయపెట్టాలని చూస్తున్నారు..

    • హింసా జ్వాలను సీఎం చంద్రబాబు రాజేశారు..

    • అవే మంటలు చంద్రబాబు సర్కార్‌ను దహిస్తాయి: జగన్‌

    • జోగి రమేష్‌కు పార్టీ అండగా ఉంటుంది: జగన్‌

  • ఫిబ్రవరి 01, 2026 8:50 PM IST

    నందినగర్‌కు భారీగా BRS శ్రేణులు..

    • హైదరాబాద్‌: నందినగర్‌కు భారీగా BRS శ్రేణులు..

    • కేసీఆర్‌ నివాసానికి BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..

    • సిట్‌ విచారణ అనంతరం బయటకు వచ్చి కార్యకర్తలకు కేసీఆర్‌ అభివాదం..

  • ఫిబ్రవరి 01, 2026 8:13 PM IST

    కేసీఆర్‌ సిట్‌ విచారణపై కేటీఆర్‌ స్పందన

    • కేసీఆర్‌ అంటే తెలంగాణ చరిత్ర: కేటీఆర్‌

    • మూర్ఖులకు చరిత్ర అర్థం కాదు: కేటీఆర్‌

    • ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్‌: కేటీఆర్‌

    • తెలంగాణ ఉద్యమంలో సెకను కూడా పక్కకు తప్పుకోని ధీశాలి కేసీఆర్‌: కేటీఆర్

  • ఫిబ్రవరి 01, 2026 8:06 pm IST

    BRS భవన్ దగ్గర మరోసారి ఉద్రిక్తం..

    • BRS భవన్‌ నుంచి నందినగర్‌లోని.. కేసీఆర్‌ నివాసానికి వెళ్లేందుకు BRS నేతల యత్నం..

    • BRS నేతలను అడ్డుకున్న పోలీసులు..

    • గేటు ఎదుట BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బైఠాయింపు..

    • ప్రభుత్వానికి వ్యతిరేకంగా BRS నేతల నినాదాలు.

  • ఫిబ్రవరి 01, 2026 7:58 PM IST

    ముగిసిన కేసీఆర్‌ సిట్‌ విచారణ..

    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను నాలుగున్నర గంటలకు పైగా ప్రశ్నించిన సిట్‌..

    • నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌ను ప్రశ్నించిన ఆరుగురు అధికారుల బృందం..

    • గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్‌..

    • కేసీఆర్‌ ఎదుట ఆధారాలు ఉంచి ప్రశ్నించిన సిట్‌ అధికారులు.

    • BRS ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై.. ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపై సిట్‌ సుదీర్ఘ విచారణ..

    • విచారణ అనంతరం కేసీఆర్‌ నివాసం నుంచి వెళ్లిపోయిన సిట్‌ అధికారులు.

  • ఫిబ్రవరి 01, 2026 7:20 PM IST

    తెలంగాణకు బీఆర్ఎస్ ఒక్కటే పేటెంట్ కాదు: కోదండరామ్

    • ప్రశ్నించే మీడియాపై దాడి చేయడం సరికాదు.

    • ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచి పద్ధతి కాదు.

    • పదేళ్లు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ఇలాంటి పద్ధతినే కొనసాగిస్తే ప్రజలకు మరింత దూరమవుతారు.

  • ఫిబ్రవరి 01, 2026 7:10 PM IST

    అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ.

    • రాజకీయ నాయకుల వ్యాఖ్యలు హుందాగా ఉండాలి: హైకోర్టు

    • ఎదుటివారిని నొప్పించకూడదని స్పష్టంచేసిన ఏపీ హైకోర్టు

    • అంబటి రాంబాబు నివాసం దగ్గర ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని కోర్టుకు తెలిపిన పోలీసులు.

    • అంబటి నివాసం దగ్గర 15 మంది పోలీసుల బృందం ఉందని కోర్టుకు తెలిపిన పోలీసుల తరఫు న్యాయవాది.

    • అన్ని విషయాలను రికార్డు చేసిన ఏపీ హైకోర్టు.

  • ఫిబ్రవరి 01, 2026 7:09 PM IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా: కిషన్‌ రెడ్డి

    • ఫిబ్రవరి 7న మహబూబ్‌నగర్‌లో అమిత్‌ షా ప్రచారం.

    • ఫిబ్రవరి 4న నితిన్‌ నబీన్‌ ఎన్నికల ప్రచారం.

  • ఫిబ్రవరి 01, 2026 6:48 PM IST

    ఢిల్లీ: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ భయంకరంగా ఉంది: కిషన్‌ రెడ్డి

    • రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవ్వలేదు, డీఏ ఇవ్వడం లేదు.

    • తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థకు రూ.51 వేల కోట్లు ఇవ్వాలి.

    • కేసీఆర్‌, రేవంత్ ప్రభుత్వాలలో ఇప్పటివరకు తొమ్మిదిన్నర లక్షల కోట్లు అప్పులు చేశారు.

  • ఫిబ్రవరి 01, 2026 6:40 PM IST

    ములుగు: మేడారంలో భారీగా పేరుకుపోయిన చెత్తా, చెదారం

    • భక్తులు పడేసిన జంతు వ్యర్థాలతో దుర్గంధ భరితంగా మేడారం పరిసరాలు.

    • పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు.

  • ఫిబ్రవరి 01, 2026 6:39 PM IST

    ABN ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై బీఆర్ఎస్ దాడిని ఖండించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

    • మీడియా ప్రతినిధిపై దాడి మంచి సంప్రదాయం కాదు.

    • దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

    • మీడియాపై దాడిని అందరూ ఖండించాలి.

    • రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

    • మీడియాపై దాడి మంచి సంస్కృతి కాదు.

  • ఫిబ్రవరి 01, 2026 6:35 PM IST

    ABN ఆంధ్రజ్యోతిపై బీఆర్ఎస్ దాడి గర్హణీయం: మంత్రి పొన్నం

    • మీడియాపై దాడి మంచి సంస్కృతి కాదు.

    • ప్రజాస్వామ్యాన్ని గౌరవించని పార్టీ బీఆర్ఎస్.

    • ప్రశ్నించే గొంతుకలపై దాడి అత్యంత దారుణం.

  • ఫిబ్రవరి 01, 2026 5:55 PM IST

    హైదరాబాద్‌: ప్రముఖ టాలీవుడ్‌ నటుడు రఘునాథ్‌రెడ్డి(56) మృతి.

    • గుండెపోటుతో చనిపోయిన రఘునాథ్ రెడ్డి.

    • 370కి పైగా సినిమాల్లో నటించిన రఘునాథ్‌రెడ్డి.

  • ఫిబ్రవరి 01, 2026 5:55 PM IST

    కృష్ణా: ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత

    • జోగి రమేష్‌ నివాసానికి నిప్పు పెట్టిన టీడీపీ కార్యకర్తలు.

    • జోగి రమేష్‌ నివాసంపై టీడీపీ శ్రేణుల రాళ్ల దాడి.

    • మైలవరం నుంచి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు.

    • దాడి సమయంలో ఇంట్లో లేని జోగి రమేష్‌ కుటుంబం.

  • ఫిబ్రవరి 01, 2026 5:49 PM IST

    కృష్ణా: ఇబ్రహీంపట్నంలో ABN సిబ్బందిపై దాడికి వైసీపీ మూకల యత్నం

    • వైసీపీ మూకలను అడ్డుకున్న స్థానికులు, టీడీపీ కార్యకర్తలు.

    • వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు.

    పూర్తికథనం

  • ఫిబ్రవరి 01, 2026 5:15 PM IST

    బీఆర్ఎస్ భవన్‌ దగ్గర ABN సిబ్బందిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.

    • కవరేజీలో ఉన్న ABN రిపోర్టర్‌, కెమెరామన్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.

    • ABN ఆంధ్రజ్యోతి కెమెరా ధ్వంసం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు.

  • ఫిబ్రవరి 01, 2026 08:29 IST

    ముంబై: జుహులో కాల్పుల కలకలం

    • బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

    • రాత్రి 12:40కి ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు

    • కాల్పులు జరిపి బైక్‌పై వెళ్లిపోయిన గుర్తుతెలియని యువకుడు

    • ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్ షెల్స్‌ స్వాధీనం, కేసు నమోదు

    పూర్తి కథనం

  • ఫిబ్రవరి 01, 2026 08:27 IST

    కేసీఆర్‌ విచారణ సందర్భంగా నందినగర్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

    • నందినగర్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు

    • నందినగర్‌ బస్‌స్టాప్‌, బసవతారకం రోటరీ, అగ్రసేన్‌ జంక్షన్‌ దగ్గర ఆంక్షలు

    • స్టడీ సర్కిల్‌, ఎన్టీఆర్‌ భవన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

    • వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసుల సూచన

  • ఫిబ్రవరి 01, 2026 08:26 IST

    మూడోరోజు పర్యటన

    • కుప్పంలో మూడోరోజు సీఎం చంద్రబాబు పర్యటన

    • కార్యకర్తలతో సమావేశంకానున్న చంద్రబాబు

  • ఫిబ్రవరి 01, 2026 07:26 IST

    రాష్ట్రపతిని కలవనున్న నిర్మల

    • కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

    • రాష్ట్రపతికి బడ్జెట్‌ సమర్పించి అనుమతి తీసుకోనున్న నిర్మల

  • ఫిబ్రవరి 01, 2026 07:25 IST

    నేడే కేంద్ర బడ్జెట్..

    • నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

    • ఉ.11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మల

    • వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌

    • తొలిసారి ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మల

    • ఆత్మనిర్భర్‌, వికసిత భారత్‌ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌

  • ఫిబ్రవరి 01, 2026 07:24 IST

    బీఆర్ఎస్ ఆందోళనలు..

    • నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు

    • కేసీఆర్‌కు సిట్ నోటీసులు వ్యతిరేకిస్తూ నిరసనలకు BRS పిలుపు

  • ఫిబ్రవరి 01, 2026 07:23 IST

    హైదరాబాద్‌: నేడు సిట్‌ విచారణకు కేసీఆర్‌

    • మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌ నివాసంలో సిట్‌ విచారణ

    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ను ప్రశ్నించనున్న సిట్‌



  • Source link

    Spread the love