సుదీర్ఘకాలంగా నిలబడివంటి భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఎట్టకేలకు ఒక పోలికకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి అమెరికా భారత్ ట్రేడ్ డీల్‌ను ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా ఇప్పటివరకు భారత వస్తువులపై విధిస్తున్నటువంటి పరస్పర రెసిప్రొకల్ సుంకాలను 25% నుండి 18 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది చరిత్రాత్మకమైన డీల్ అని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ కంపెనీలు ఈ డీల్ వల్ల ఎంతో లబ్ధి పొందనున్నాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.
ఈ డీల్‌కు సంబంధించి ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ట్రూత్ పోస్ట్ వేదికగా సుదీర్ఘమైన లేఖ రాశారు. ట్రంప్ తన లేఖలో పలు అంశాలతో భారత్ ఇకపై రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు తగ్గిపోతుందని ఆశిస్తున్నాము. అంతేకాదు అదనంగా అమెరికా లేదా వెనుజుల వంటి దేశాల నుంచి భారత్‌కు ఆయిల్ సరఫరా చేయడం పైన చర్చించినట్లు ట్రంప్ ప్రకటించారు.
దీనితో పాటు ట్రంప్ ప్రకటనలో భారత్ అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై ఉన్న సుంకాలను కూడా జీరో తగ్గించే దిశగా ముందుకు వస్తుందని, నాన్ టారిఫ్ అడ్డంకులను పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులు భారతదేశంలోకి ప్రవేశించేందుకు ఈ ఒప్పందం అవుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ “బై అమెరికన్”ని ఇచ్చారని ఈ సందర్భంగా ట్రంప్ తన సిద్ధాంత పోస్ట్‌లో ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. అమెరికా ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడానికి భారత్ అంగీకరించిందని ఆయన చెప్పారు. ఇందులో ముఖ్యంగా అమెరికన్ ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్, ఇతర వస్తువులను భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుందని, దీనివల్ల సమాన మార్కెట్ అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మోడీ తనకు గొప్ప మిత్రుడని, బలమైన నాయకుడని ఆయన వ్యక్తిగతంగా అభినందించారు. ఈ ఒప్పందం ద్వారా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆయన పేర్కొన్నారు. రాజకీయ, వ్యాపార, భద్రతాపరమైన ఇతర సంబంధాల విషయంలో కూడా ఇది విస్తరిస్తుందని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ట్రేడ్ డీల్ వల్ల భారతీయ కంపెనీలు పెద్ద ఎత్తున లాభపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య సుంకాల తగ్గింపు వల్ల ట్రేడ్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు నిర్ధారించారు. విదేశీ పెట్టుబడులు సైతం భారతదేశంలో పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా వాణిజ్య వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రధాని మోదీ స్పందన:
భారత్ అమెరికా మధ్య కుదిరినటువంటి ఈ వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోడీ సైతం స్పందించారు. ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడడం ఆనందంగా ఉందని మోడీ పేర్కొన్నారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు 18% తగ్గినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రకటనను 1.4 బిలియన్ భారత ప్రజలు స్వాగతించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ట్రంప్ కీలకమని సూచించింది. భవిష్యత్తులో భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.