ఏపీ, తెలంగాణలో నేటి నుంచి రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. నేటి నుంచి వివాహ ముహూర్తాలు మొదలవుతున్నాయి. ఢిల్లీ ఏఐ సదస్సులో నేడు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. నేడు విశాఖలో మిలాన్ 2026ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. నేడు ఢిల్లీలో తెలంగాణ నేతలతో ఏఐసీసీ సమావేశం ఉంటుంది. తెలంగాణ.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ జరుపుతారు. 19-21 మధ్య సంగారెడ్డిలో IIT హైదరాబాద్.. SMSE టెక్ కనెక్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. నేడు వోక్స్వ్యాగన్ Tayron R-Line కారు లాంచ్ అవుతుంది. T20 వరల్డ్ కప్లో నేడు వెస్టిండీస్Xఇటలీ, శ్రీలంకxజింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్xకెనడా మ్యాచ్లు ఉన్నాయి. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.