ముఖ్యమైన నిబంధనలు:
* ఒకసారి నిర్ణయించిన సభ్యుల సంఖ్య, నెక్ట్స్ జనాభా గణన వివరాలు కేంద్ర ప్రభుత్వం ప్రచురించే వరకూ మారవు.
* కొత్తగా వార్డుల విభజన జరిగినప్పుడు లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మారినప్పుడు ఈ సంఖ్య అమల్లోకి వస్తుంది.
* వార్డుల సంఖ్య పెరిగినా, ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేసుకోవాలి తప్ప కొత్త నియామకాలు చేపట్టకూడదు.
ఇవాళ ఏమున్నాయి?
ఇరాన్ యుద్ధానికి 25 రోజులు పూర్తి అయ్యాయి. ట్రంప్ ప్రకటనతో తాత్కాలిక బ్రేక్ ఉంది. నేడు కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారు. ఉదయం 10కి జగిత్యాల బండారీ గార్డెన్లో ఆత్మీయులతో సమావేశం పెట్టుకుంటున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా.. అద్దంకి నేతలతో వైఎస్ జగన్ సమావేశం అవుతారు. పశ్చిమాసియా సంక్షోభంపై ఇవాళ సాయంత్రం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఉంది. ఏపీలో నేటి నుంచి సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.