AP News Updates: ఏపీ ప్రజలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు.. సీఎం చంద్రబాబు ప్రకటన |


పథకాలకు సంబంధించి ప్రతీ కుటుంబానికీ రకరకాల కార్డులు కాకుండా.. కుటుంబం మొత్తానికీ ఒకటే స్మార్ట్ కార్డు ఉండేలా చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పుడు ఒక్కో పథకానికీ ఒక్కో కార్డు అవసరం ఉండదు అన్నారు. ఒకే స్మార్ట్ ఫ్యామిలీ కార్డుతో కుటుంబ సభ్యులకు అందే పథకాలు, అర్హతల వివరాలు అన్నీ తెలుస్తాయి అని చెప్పారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డులో కేంద్ర, రాష్ట్ర పథకాల లబ్ధి మొత్తాలు, ఏ పథకాలకు అర్హత ఉంది వంటి 25 రకాల వివరాలు అంటే.. ఆధార్, రేషన్, పెన్షన్, స్కాలర్‌షిప్‌లు, వాక్సినేషన్ వంటి వివరాలు ఉంటాయి. QR కోడ్‌ స్కాన్ చేసి వాటిని తెలుసుకోవచ్చు. ఏపీలో 1.4 కోట్ల కుటుంబాల వివరాల్ని 2026 జూన్ లోగా.. స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల రూపంలో.. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (FBMS) కింద జారీ చేస్తారు. ఇది పారదర్శకత, సుపరిపాలనను పెంచి, పౌర సేవల్ని సులభతరం చేస్తుంది.

ఇవాళ ఏమున్నాయి?

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మొదలై 7 రోజులు పూర్తైంది. ఇవాళ 8వ రోజు కొనసాగుతోంది. నేడు JNTUలో తెలంగాణ పోలీస్ ఉమెన్ సేప్టీ వింగ్ అధ్వర్యంలో స్టాండ్ విత్ హెర్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హాజరవుతారు. ఉదయం 11.01కి ధురంధర్ 2 సినిమా ట్రైలర్ లాంచ్ అవుతుంది. 19న సినిమా రిలీజ్ ఉంది. నేడు డార్జిలింగ్‌కి వెళ్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అక్కడ 9వ ఇంటర్నేషనల్ సంతాల్ కాన్ఫరెన్స్‌కి హాజరవుతారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే రైసినా డైలాగ్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. నేడు రంగుల పంచమి. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love