సౌదీ అరేబియాలో నెలవంక కనిపించడంతో నేటి నుంచి రంజాన్ అని భావిస్తున్నారు. కొంతమంది రేపటి నుంచి అంటున్నారు. నేటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి 11 రోజులు ఉంటాయి. ఈ నెల 28 వరకూ కొనసాగుతాయి. నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ వెళ్తున్నారు. హైకమాండ్‌తో చర్చలుంటాయి. విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూమిలాన్ నేడు, రేపు జరుగుతుంది. ప్రపంచ యుద్ధనౌకలు, సబ్ మెరైన్ల ప్రదర్శన ఉంటుంది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. నేడు దానం నాగేందర్‌ని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నిస్తారు. అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెడుతూ.. నేడు బెంగాల్‌కి అమిత్ షా వెళ్తున్నారు. తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్స్ ఇవాళ విడుదల అవుతాయి. టీ20 వరల్డ్ కప్‍లో నేడు భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్ రాత్రి 7గంటలకు ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.