AP News Updates: పెన్షనర్లకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను ఈసారి ఏప్రిల్ 1న ఇవ్వబోతోంది. ఆ రోజు బుధవారం కాబట్టి.. సచివాలయ ఉద్యోగులకు సెలవు లేదు. ఐతే.. పెన్షన్లపై తాజాగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులపై సీరియస్ అయిన ఆయన.. ఇకపై “పెన్షన్ల పంపిణీ అంశంలో రియల్ టైమ్‌ మానిటరింగ్ చేస్తానని అన్నారు. ఇది మంచి నిర్ణయమే. దీని వల్ల పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుంది. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీలో భారీ తేడా ఎందుకు వస్తుందో తేలాలి. ఉదాహరణకు మార్చి నెలలో మొత్తం పెన్షన్లు 62,76,325 ఉంటే.. ఇచ్చింది మాత్రం 60,69,664మందికే. ఇంకా 2,06,661 మందికి ఎందుకు ఇవ్వలేదో చెప్పట్లేదు. ప్రతీ నెలా ఇలాగే జరుగుతోంది. అందుకే సీఎం దీనిపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఆ తర్వాతైనా పరిస్థితి మారి, అందరికీ పెన్షన్ వస్తే, మంచిదే.

ఇవాళ ఏమున్నాయి?

ఇరాన్ యుద్ధానికి 31 రోజులు పూర్తి అయ్యాయి. ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్‌ గడువు నేటితో ముగుస్తుంది. కానీ గణపతి సహా కొంతమంది మావోయిస్టులు ఇంకా లొంగలేదు. IPLలో నేడు పంజాబ్, గుజరాత్ మ్యాచ్. రాత్రి 7.30కి ఉంది. ఇవాళ మహావీర్ జయంతి. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love