AP News Updates: పెన్షన్ లబ్దిదారులకు తీపి కబురు.. వారికి డబుల్ పెన్షన్ |


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి నెలకు సంబంధించిన పెన్షన్‌ను ఇవాళ ఆదివారం కావడంతో.. నిన్న ఫిబ్రవరి 28న పంపిణీ చేసింది. ఐతే.. కొంతమంది తమకు ఫిబ్రవరి నెల పెన్షన్ రాలేదని తెలిపారు. మరికొందరు జనవరి, ఫిబ్రవరి నెలల పెన్షన్ రాలేదని తెలిపారు. ఇలా పెన్షన్ మిస్సయిన వారు.. పాత పెన్షన్ గురించి అడిగారు. ఈ విషయం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో.. సంచివాలయాల్లో.. పాత పెన్షన్లు ఇచ్చేందుకు వీలుగా టెక్నికల్ మార్పులు చేశారు. ఎవరికైతే పాత పెన్షన్లు ఇవ్వలేదో, వారి డేటాని ఇప్పుడు అన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చారు. దాన్ని వారు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. తద్వారా వెంటనే పాత పెన్షన్ చెల్లించవచ్చు. అందువల్ల 3 నెలల వరకూ పెన్షన్ అందనివారంతా.. ఇప్పుడు ఆ పెన్షన్ పొందవచ్చు. ఇందుకోసం సచివాలయ ఉద్యోగులతో మాట్లాడాలి. తద్వారా వారు వెంటనే ఇస్తారు.

ఇవాళ ఏమున్నాయి?

కాకినాడలో బాణసంచా పేలుడు విషాదం అందర్నీ కలచివేసింది. ఇరాన్-అమెరికా యుద్ధం అంతకంతకూ తీవ్రమై.. గల్ఫ్ అంతటా విస్తరిస్తోంది. ఇవాళ్టి నుంచి సిమ్ లేకుండా వాట్సాప్‌ని వాడలేరు. నేటి నుంచి అందుబాటులోకి ‘RailOne’ యాప్ వచ్చింది. ఇవాళ అమరావతిలో జ్యుడీషియల్‌ అకాడమీకి CJI జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేస్తారు. నేడు ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కెనడా ప్రధాని మార్క్ కార్నీ భేటీ అవుతారు. T20 ప్రపంచ కప్‌లో నేడు జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్.. మధ్యాహ్నం 3కి ఉంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్.. రాత్రి 7కి ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love