నేడు భోగి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ రెండో రోజు జరుగుతుంది. సీఎం చంద్రబాబు నారావారి పల్లెలో వేడుకలు జరుపుకుంటున్నారు. నేడు మేడారంలో శుద్ది పండుగ (గుడిమెలిగే) జరుగుతుంది. పశ్చిమగోదావరి, నరసాపురంలో నేటి నుంచి జాతీయ స్ధాయి కబడ్డీ పోటీలు జరుగుతాయి. కృష్ణా జిల్లా, ఘంటసాలలో నేటి నుంచి ఒంగోలు జాతి పశు ప్రదర్శన పోటీలు జరుగుతాయి. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా, శర్వానంద్.. నారీ నారీ నడుమ మురారీ సినిమా ఇవాళ రిలీజ్ అవుతున్నాయి. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో శివాజీ దండోరా మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇవాళ ఇండియా, న్యూజిలాండ్ సెకండ్ వన్డే ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.