AP News Updates: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో చిన్న మార్పు |


ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో చిన్న మార్పు వచ్చింది. మార్చి 20న జరగాల్సిన జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను మార్చి 21న శనివారం నాడు నిర్వహిస్తామని SSC బోర్డు అధికారికంగా ప్రకటించింది. మార్చి 20న రంజాన్ పండుగ ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. మిగిలిన అన్ని పరీక్షలూ ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే జరుగుతాయి. పరీక్షల వ్యవధి చూస్తే.. మార్చి 16 నుంచి.. ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి.

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూపాలపల్లిలో పర్యటించి.. ఎన్నికల ప్రచారం చేస్తారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేసియా పర్యటనలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ వరంగల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అటు శ్రీశైలం నేడు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇక వాలంటైన్స్ వీక్‌లో భాగంగా రెండో రోజైన ఇవాళ ప్రపోజ్ డే ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love