ఇవాళ ఏమున్నాయి?
శ్రీవిష్ణు, నయన సారిక విష్ణు విన్యాసం సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందుకు ఇవాళ దానం నాగేందర్ రావాల్సి ఉంది. మంత్రి నారా లోకేష్ ఇవాళ ముంబైకి వెళ్తున్నారు.. హయత్ రీజెన్సీలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. నేడు ఆయేషా మీరా శరీర అవశేషాల అప్పగింత ఉంది. తెనాలిలో భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. నేడు.. రాజస్థాన్.. జైసల్మేర్లో యుద్ధ హెలికాప్టర్ ప్రచండ్లో ప్రయాణించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గద్వాల న్యూటౌన్.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా ఉంది. కడప జిల్లా.. కమలాపురంలోని యోగి వేమన యూనివర్సిటీ వేదికగా జాబ్మేళా ఉంది. T20 ప్రపంచ కప్లో నేడు ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ రాత్రి 7కి ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.