AP News Updates: విశాఖ, హైదరాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు | జాతీయం-అంతర్జాతీయం


ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే.. విశాఖపట్నం, చర్లపల్లి మధ్య 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఇవి జనవరి 18, 19 తేదీల్లో నడుస్తాయి. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 08517 నంబర్ గల విశాఖపట్నం – చర్లపల్లి రైలు 18న మధ్యాహ్నం 3:50కి విశాఖపట్నం నుంచి బయలుదేరి, 19న ఉదయం 7:30కి చర్లపల్లికి వస్తుంది. అలాగే 08518 నంబర్ గల చర్లపల్లి – విశాఖపట్నం రైలు జనవరి 19న ఉదయం 9కి చర్లపల్లి నుంచి బయలుదేరి, అర్ధరాత్రి 12:30కి విశాఖపట్నంకి వెళ్తుంది. ఈ ప్రత్యేక రైళ్లు.. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతాయి.

జంతికలు, మురుకులు, సకినాలతో పల్లెల నుంచి సిటీలకు పయనాలు మొదలయ్యాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర మళ్లీ ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. నేడు ఎన్టీఆర్‌ 30వ వర్ధంతి. ఏపీలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. నేడు బెంగాల్‌లో అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. పనిలో పనిగా 4 అమృత భారత్ రైళ్లు కూడా ప్రారంభిస్తారు. ఇవాళ ఖమ్మం జిల్లా.. పాలేరుకి సీఎం రేవంత్ వెళ్లి.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం తర్వాత మేడారంకి వెళ్లి.. సాయంత్రం కేబినెట్ సమావేశం అక్కడే పెడతారు. నేడు ఆదిలాబాద్ జిల్లా.. కేస్లాపూర్‌లో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. నేడు స్విట్జర్లాండ్.. దావోస్‌కి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. నేడు ఖమ్మంలో సీపీఐ భారీ బహిరంగ సభ ఉంది. గోల్కొండ, పరేడ్ గ్రౌండ్‌లో నేడు చివరి రోజుగా హాట్ ఎయిర్ బెలూన్ షో ఉంది. 18 నుంచి 31 వరకూ ఢిల్లీ లోని దిల్లీ హాత్ దగ్గర.. పీఎం విశ్వకర్మ హాత్ మేళా జరుగుతుంది. నేడు మౌనీ అమావాస్య. నేడు ఇండియా, న్యూజిలాండ్ మూడో, చివరి వన్డే ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love