ఇవాళ ఏమున్నాయి?
నేడు ఆకాశంలో.. వరుసగా 6 గ్రహాలు కనిపిస్తాయి. ఇవాళ ఏపీలో పెన్షన్ పంపిణీ జరుగుతుంది. సీఎం చంద్రబాబు విజయనగరం.. చీపురుపల్లికి వెళ్లి.. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, పింఛను పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ రాజస్థాన్.. అజ్మీర్ నుంచి HPV వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని ప్రధాని మోది ప్రారంభిస్తారు. మంత్రి నారా లోకేష్ నేడు అనకాపల్లిలో పర్యటిస్తారు. ఓ హెల్త్ కేర్ సంస్థకు శంకుస్థాపన చేస్తారు. ఏపీ కొత్త సీఎస్‌గా నేడు సాయిప్రసాద్ బాధ్యతల స్వీకరిస్తారు. నేడు కామారెడ్డిలో బీజేపీ శాసన సభా పక్ష సమావేశం ఉంటుంది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందుకు నేడు కడియం శ్రీహరి విచారణకు వస్తారు. కోనసీమ జిల్లా, రాజోలు, మాలికిపురంలో ఉన్న ఎంవీఎన్ జేఎస్ & ఆర్వీఆర్ కళాశాల ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్‌లో జాబ్ మేళా ఉంది. అలాగే కృష్ణా జిల్లా.. గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 9కి జాబ్ మేళా ఉంది. మహేష్ బాబు నటించిన అతడు సినిమా రీ-రిలీజ్ నేడు ఉంది. ఇవాళ T20 ప్రపంచ కప్‌లో శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ రాత్రి7కి ఉంది. ఇవాళ నేషనల్ సైన్స్ డే. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.