Axis Nifty India Defense Index Fund,ఇన్వెస్టర్లకు అలర్ట్.. యాక్సిస్, కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీం.. కనీసం రూ. 100 తో చేరొచ్చు! – ఇక్కడ ప్రారంభించబడిన కోటక్ మరియు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుండి కొత్త nfos కనీస పెట్టుబడి మరియు చందా గడువులు
Axis Nifty India Defense Index Fund,ఇన్వెస్టర్లకు అలర్ట్.. యాక్సిస్, కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీం.. కనీసం రూ. 100 తో చేరొచ్చు! – ఇక్కడ ప్రారంభించబడిన కోటక్ మరియు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుండి కొత్త nfos కనీస పెట్టుబడి మరియు చందా గడువులు
కోటక్ మ్యూచువల్ ఫండ్: మ్యూచువల్ ఫండ్లలో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్లలో ఐపీఓల మాదిరిగానే ఎన్ఎఫ్ఓలు ఉంటాయి. ఇప్పుడు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాలను ప్రారంభించాయి. వీటి గురించి తెలుసుకుందాం. కనీసం ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు.. సబ్స్క్రిప్షన్ తేదీలు ఎప్పుడు వంటి వివరాలను చూద్దాం.
హైలైట్:
పెట్టుబడులు పెట్టే వారికి అలర్ట్
అందుబాటులోకి మరో రెండు మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓలు
లాంఛ్ చేసిన కోటక్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీమ్స్(ఫోటోలు– నవభారత్ టైమ్స్)
మ్యూచువల్ ఫండ్ కొత్త NFOలు: స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా చాలా మంది మ్యూచువల్ ఫండ్లను పెంచుకుంటారు. ఇక్కడ దీర్ఘ కాలంలో పెద్దగా రిస్క్ ఉండదని చెబుతుంటారు. కాంపౌండింగ్ కారణంగా లాంగ్ రన్లో సంపద విపరీతంగా పెరుగుతుందని చెబుతారు. ఇక స్టాక్ మార్కెట్లలో ఐపీఓలు ఉన్నట్లే.. మ్యూచువల్ ఫండ్లలో ఎన్ఎఫ్ఓ (న్యూ ఫండ్ ఆఫర్) ఉంటుంది. ఐపీఓ అంటే ఏదైనా కంపెనీ తొలిసారిగా షేర్ల విక్రయం ద్వారా నిధులను సమీకరించడం. ఎన్ఎఫ్ఓ అంటే.. ఏదైనా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్త పథకం ప్రారంభించడం. ఎన్ఎఫ్ఓలకు ముందుగా నిర్దిష్ట సమయం సబ్స్క్రిప్షన్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు కాస్త తక్కువ ధరకే మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వస్తాయి. తర్వాత మళ్లీ కొన్ని రోజులకు రెగ్యులర్‌గా క్రయవిక్రయాలకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లలో మరో రెండు ఫండ్స్.. కొత్త స్కీమ్స్ ప్రకటించాయి. వీటిలో ఒకటి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ . ఇది యాక్సిస్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్‌ను లాంఛ్ చేసింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఫండ్. ఇది నిఫ్టీ ఇండియా డిఫెన్స్ టీఆర్ఐలోని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. దాదాపు 95 నుంచి 100 శాతం వరకు ఈ కేటగిరీ కంపెనీ స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెడుతుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ ఏప్రిల్ 10న అంటే ఇవాళే కనిపిస్తుంది. ఆఖరి తేదీ ఏప్రిల్ 24న ఉంది. మొదటిసారి పెట్టుబడులు పెట్టే వారు సిప్ లేదా లంప్ సమ్ ఏదైనా కనీసం రూ. 100 నుంచి ప్రారంభించొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ (TRI) ఈ పథకం పనితీరుకు కొలమానంగా ఉంది. ఈ ఫండ్ మేనేజర్‌గా నందిక్ మల్లిక్, రోహిత్ గౌతమ్ నటించారు. , మరోవైపు.. కోటక్ మ్యూచువల్ ఫండ్ .. కాస్త సరికొత్తగా కోటక్ మల్టీ అసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ ఈక్విటీ, డెట్, కమొడిటీల్లో అన్నింట్లో ఒకేసారి పెట్టుబడులు పెట్టేందుకు అందిస్తుంది. ఈ ఎన్ఎఫ్ఓలో పెట్టుబడి పెట్టేందుకు ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉంది. ఇది ఫండ్ ఆఫ్ ఫండ్స్ రకానికి చెందినది. అంటే ఇది ఇతర మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ అవుతుంది. కనీస పెట్టుబడి ఇక్కడ రూ. 1000 గా ఉంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ఫండ్ మేనేజర్లు.. డెంట్‌లో ఎంత డబ్బు పెట్టాలో నిర్ణయిస్తారు.
గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి.. వీటిల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
రచయిత గురించిపూర్ణచందర్ తూనంపూర్ణచందర్ తూనం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022 సమయంలో చేరిన పూర్ణ చందర్.. బిజినెస్ రంగానికి సంబంధించిన తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ న్యూస్, బంగారం వెండి ధరలపై అప్డేట్లు అందజేసారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. అంకిత భావంతో పని చేసిన గానూ 2024 ఏప్రిల్‌లో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి అబౌవ్ అండ్ బియాండ్ కాల్ ఆఫ్ డ్యూటీ (ఏబీసీడీ) అవార్డును పూర్ణచందర్ అందుకున్నారు. పూర్ణచందర్.. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం.. ఈటీవీ భారత్ సంస్థలో నాలుగేళ్ల పాటు పనిచేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. ఖాళీ సమయంలో కుటుంబంతో గడపడం, సినిమాలు, క్రికెట్ చూడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తారు.… ఇంకా చదవండి