BRS: ఆ నాలుగు మున్సిపాలిటీల్లో ఖాతా తెరవని బీఆర్‌ఎస్‌


ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణలో వెలువడిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి 13 పురపాలికలతో సరిపెట్టుకుంది. కోస్గి, మక్తల్‌, ధర్మపురి, భైంసా మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేదు. ధర్మపురిలో మొత్తం 15 వార్డులు ఉండగా.. అన్నింటినీ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కోస్గిలో 16 స్థానాలు ఉండగా మొత్తం కాంగ్రెస్‌ ఖాతాలోనే పడ్డాయి.

13 మున్సిపాలిటీల్లో సింగిల్‌ డిజిట్‌

ఎల్లారెడ్డి, యాదగిరిగుట్ట, వడ్డేపల్లి, సుల్తానాబాద్‌, పెద్దపల్లి, నందికొండ, మంథని, మధిర, కొడంగల్‌, హాలియా, చొప్పదండి, భూత్పూర్‌, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డులో మాత్రమే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కాంగ్రెస్‌ 1347 వార్డుల్లో విజయం సాధించి 64 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. భారత రాష్ట్ర సమితి 717 వార్డుల్లో గెలుపొంది 13 మున్సిపాలిటీలు దక్కించుకుంది. భాజపా 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో విజయం సాధించారు. 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ కైవసం చేసుకోవడం గమనార్హం. జగిత్యాలలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.



Source link

Spread the love