
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. బుధవారం (అక్టోబర్ 22) ఉదయం 11:50 గంటలకు సన్నిధానంలో అయ్యప్ప స్వామికి రాష్ట్రపతి ముర్ము ప్రార్థనలు చేశారు.

1970లలో డాలీలో మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఆయన తరువాత శబరిమల ఈ మందిరాన్ని సందర్శించిన రెండవ భారత రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు.

పతనంతిట్టలోని ప్రమద స్టేడియంలో ఉదయం ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్ కుంగిపోయింది. అదృష్టవశాత్తూ రాష్ట్రపతి ముర్ముకు ఏం కాలేదని అధికారులు తెలిపారు.

బుధవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక కాన్వాయ్‌లో పంబకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పంపా నదిలో పాదాలు కడుక్కుని, గణపతి మందిరంతో పాటు అక్కడి దేవాలయాలను సందర్శించారు.
ప్రచురించబడినది : 22 అక్టోబర్ 2025 03:36 PM (IST)