చివరిగా నవీకరించబడింది:
Employment Scheme 2025: తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థిక పురోగతి పెంపొందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన షెడ్యూల్ కులాల వార్షిక ప్రణాళిక 2025-26 ప్రకటించింది. ఈ మేరకు హన్మకొండ జిల్లా ఎస్సీ సహకార అభివృద్ధి శాఖ అధికారి బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉపాధి పథకం 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా వార్షిక ప్రణాళిక అమలు చేస్తుంది.ఇందులో విద్యా,స్వయం ఉపాధి,భూమి కొనుగోలు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిస్తూ జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో వాటాను కేటాయిస్తూ ఎస్సి లబ్ధిదారుల ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలను చేపడుతుంది.
ఎస్సీ సబ్ ప్లాన్ కింద విడుదలైన నిధులను కచ్చితంగా ఖర్చు చేయడం, నిధులు మళ్ళించకుండా చూడడం,నిధులు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై రుణాలు స్వయం ఉపాధి పథకాలు వ్యవసాయ భూమి కొనుగోలు పథకం వంటివి అమలు చేస్తుంది. వారు ఆర్థికంగా ఎదిగేందుకు వారికి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు పోతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థిక పురోగతి పెంపొందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన షెడ్యూల్ కులాల వార్షిక ప్రణాళిక 2025-26 ప్రకటించింది. ఈ మేరకు హన్మకొండ జిల్లా ఎస్సీ సహకార అభివృద్ధి శాఖ అధికారి బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని ఆసక్తి అర్హత కలిగిన వారు tgobmmsnew.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ పథకంలో రవాణా రంగంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు యూనిట్ ధర రూ.1లక్ష మరియు త్రిచక్ర గుడ్స్,ప్యాసింజర్స్ ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్ ధర రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకాలకు సంబంధించి ( జొమాటో,స్విగ్గి,రాపిడో మరియు ఉబర్ వంటి ప్లాట్ ఫామ్ లో నుండి ఎస్సీ వ్యవస్థాపకులు మరియు ఈవి ద్విచక్ర వాహన ప్రోత్సాహకాలకు ప్రాధాన్యత ఇస్తారు.
ఈ ప్రాధాన్యతను క్లైమ్ చేయడానికి దరఖాస్తుదారులు సంబంధిత సర్టిఫికెట్ సమర్పించవలసి ఉంటుంది.అదేవిధంగా వ్యవసాయ రంగం వారికి సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ మరియు అగ్రి అలైడ్ కాంపోనెంట్ ఈ యూనిట్ విలువ ధర రూ.3 లక్షల నుండి రూ.7 లక్షల వరకు ఉంటుంది.గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం నుండి స్వయం ఉపాధి పథకం ద్వారా లబ్ధి పొందిన మరియు దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఈ పథకాలకు అనర్హులు.
ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతం వారికి 1,50,000 పట్టణ ప్రాంతం వారికి 2,00,000 వార్షిక ఆదాయం మించకుండా ఉండాలి. ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఆదాయ దృవీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్,పట్టాదారు పాస్ పుస్తకం,సదరం సర్టిఫికెట్,పాస్ ఫోటోలు,ఇతర సర్టిఫికెట్స్ తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 24వ తేదీ వరకు గడువు ఉంది. ముందుగా ఆన్లైన్ లో సంబంధిత వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలను జత చేసి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో చేయాలి. జిల్లా లోని ఎస్సి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
వరంగల్, తెలంగాణ
