Harish Rao: రెండేళ్లయితే కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు: హరీశ్‌రావు


గజ్వేల్‌: మనల్ని బాగా చూసుకున్న వారికే ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గజ్వేల్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు గజ్వేల్‌లో పందులతో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి.. ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నారు.

‘‘రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ఇవ్వలేదు. కానీ, బంగారం ధర భారీగా పెరిగింది. అప్పుడు ఆశపెట్టిన సీఎం ఇప్పుడు దానిపై స్పందించట్లేదు. రేవంత్‌రెడ్డికి తిట్లు తప్ప వేరే ఏమీ రావు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గజ్వేల్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. రైతుబంధు డబ్బులు ఎన్నికల తర్వాత ఇస్తానని సీఎం అంటున్నారు. 11వ తేదీలోపు రైతుబంధు ఇవ్వకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారు. రేవంత్‌రెడ్డి.. నీకు ధైర్యం ఉంటే కేసీఆర్‌తో అభివృద్ధిలో పోటీ పడు. మా కౌన్సిలర్లను గెలిపిస్తే వచ్చే ప్రభుత్వం మాదే అవుతుంది. రెండేళ్లయితే మళ్లీ కేసీఆర్‌ సీఎం అవుతారు. మిగిలిన పనులు పూర్తి చేసుకుందాం. భాజపా వాళ్లు ఏమీ చేయరు’’అని హరీశ్‌రావు అన్నారు.



Source link

Spread the love