Hyderabad News Updates: హైదరాబాద్‌కి 915 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు | తెలంగాణ వార్తలు


కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌లో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వానికి వివిద దశల్లో ఎలక్ట్రిక్ బస్సులను ఇవ్వనుంది. అందులో భాగంగా ముందుగా 915 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఇవన్నీ త్వరలో హైదరాబాద్‌లో తిరుగుతాయి. వీటిలో కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా ఉంటాయి. తద్వారా ఇరుకైన రోడ్లలో కూడా బస్సులు వెళ్లేందుకు వీలుగా ప్లాన్ చేస్తున్నారు. ఇవి వచ్చాక, హైదరాబాద్‌లో గాలి కాలుష్యం మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ఈకేఏ మొబిలిటీ సంస్థ ఈ బస్సులను తయారుచేసి ఇవ్వనుంది. హైదరాబాద్‌లో 2,700 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలనే ప్లాన్ తెలంగాణ ప్రభుత్వానికి ఉంది.

ఇవాళ ఏమున్నాయి?

ఇరాన్ యుద్ధానికి 24 రోజులు పూర్తి అయ్యాయి.. ఐతే.. 5 రోజుల తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు ట్రంప్. నేడు నేడు లక్ష్మీ పంచమి. మంచి రోజుగా చెబుతారు. ఇవాళ వన్‌ప్లస్ కంపెనీకి చెందిన 15T మొబైల్ లాంచ్ అవుతుంది. ఇవాళ ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love