ఫీచర్స్ డెస్క్ ద్వారా
Published : 29 Sep 2025 02:44 IST
4 నిమిషాలు చదివారు
ఎన్‌ఐఆర్‌ఎఫ్ -2025 ర్యాంకులు

దేశవ్యాప్తంగా మూడువేలకు పైగా ఇంజినీరింగ్ కళాశాలలు పలు బ్రాంచీల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మేటి సంస్థల జాబితా.. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) ఏటా నమోదు అవుతోంది. ఇంజినీరింగ్‌లో 2016 నుంచి నేటి వరకు అంటే వరుసగా పదేళ్లు ఐఐటీ మద్రాసే ప్రథమ స్థానంలో నిలుస్తోంది.
దేశంలో అత్యంత ఆదరణ పొందుతున్న కోర్సుల్లో ఇంజినీరింగ్ విద్యే ముందు వరుసలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ స్థానం దీనిదే. అలాగే దక్షిణ భారతదేశంలోనూ ఇంజినీరింగ్ చదువులకే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఐఐటీ-జేఈఈ, ఈఏపీసెట్ కోసం పోటీ పడుతోన్న విద్యార్థుల సంఖ్యే ఇందుకు నిదర్శనం.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో.. ఓవరాల్ కేటగిరి, ఇంజినీరింగ్ ఇలా రెండు విభాగాల్లోనూ ప్రథమ గుర్తింపు పొందిన ఏకైక సంస్థగా ఐఐటీ మద్రాస్ గుర్తింపు పొందింది. ఇంజినీరింగ్ అనగానే గుర్తుకువచ్చేవి ఐఐటీలే. మన దేశంలో ఈ చదువులకు ఇవే ట్రేడ్ మార్కు సంస్థలు. వీటి తర్వాత స్థానంలో పాత ఎన్‌ఐటీలకు ప్రాధాన్యత దక్కుతోంది. ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి స్థానానికి పోటీ ఎప్పుడూ ఐఐటీల మధ్యే ఉంటోంది. అందువల్లే టాప్-10లో కనీసం 9 స్థానాలు ఐఐటీలకే దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటీ-మద్రాస్‌లో ఉన్న వివిధ ఇంజినీరింగ్ కోర్సుల వివరాలను చూద్దాం…
బీటెక్: ఏరోస్పేస్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ ఫిజిక్స్, మెకానికల్, మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ బ్రాంచీల్లో నాలుగేళ్ల కోర్సులు ఉన్నాయి. ఏరోస్పేస్, బయలాజికల్, ఇంజినీరింగ్ డిజైన్ విభాగంలో ఐదేళ్ల బ్యాచిలర్, మాస్టర్ టెక్నాలజీ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. సీట్లు ఐఐటీ-జేఈతో భర్తీ చేస్తారు.
ఎంటెక్: ఈ సంస్థలో ఎంటెక్‌లో బ్రాంచీలవారీ విస్తృత స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశం గేట్ ప్రతిభతో లభిస్తుంది.
ర్యాంకుల కేటాయింపు: బోధన, అభ్యాసం, వనరులు; పరిశోధన, వృత్తి అభ్యాసం; సంస్థలో చదివిన విద్యార్థుల ప్రతిభ, సంస్థలో చేరుతున్న విద్యార్థుల్లో వైవిధ్యం, అకడమిక్, పరిశ్రమలకు చెందిన నిపుణుల దృక్పథం పరామితులుగా వీటి విలువలను మదింపు చేసి మొత్తం స్కోరు ద్వారా మేటి సంస్థలను ఎంపిక చేశారు. ఇంజినీరింగ్ విషయానికొచ్చేసరికి విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో లభించిన ఉన్నత విద్యావకాశాలు, ప్లేస్‌మెంట్లు, మధ్యగత జీతం, విశ్వవిద్యాలయ పరీక్షల్లో ఫలితాలు, పీహెచ్‌డీలో చేరేందుకు అర్హత పొందినవారు…తదితరాంశాలనూ పొందారు.
టాప్ టెన్ సంస్థలు
1. ఐఐటీ- మద్రాస్
2. ఐఐటీ- ఢిల్లీ
3. ఐఐటీ- ముంబై
4. ఐఐటీ- కాన్పూర్
5. ఐఐటీ- ఖరగ్‌పూర్
6. ఐఐటీ- రవుర్కెల
7. ఐఐటీ- హైదరాబాద్
8. ఐఐటీ- గువాహటి
9. ఎన్‌ఐటీ-తిరుచురాపల్లి
10. ఐఐటీ-వారణాసి
తెలుగు రాష్ట్రాల్లో
ఐఐటీ హైదరాబాద్ 7, ఎన్‌ఐటీ వరంగల్ 28, కేఎల్ యూనివర్సిటీ టాప్ వడ్డేశ్వరం 35, త్రిబుల్ ఐటీ హైదరాబాద్ 38, ఐఐటీ తిరుపతి 57, కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ 74, విజ్ఞాన్ గుంటూరు 80, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 88, ఎస్‌ఆర్ యూనివర్సిటీ హైదరాబాద్ 91, హైదరాబాద్‌లో నిలిచిన జే.91.
- 101-150 మధ్యలో: అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్, గీతం విశాఖపట్నం, జేఎన్‌టీయూ కాకినాడ, మహీంద్ర యూనివర్సిటీ హైదరాబాద్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ హైదరాబాద్‌లో ఉన్నాయి.
- 151-200 లోపు: సీబీఐటీ హైదరాబాద్, సీవీఆర్ ఇబ్రహీంపట్నం, గోకరాజు రంగరాజు హైదరాబాద్, ఇన్‌కోట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ హైదరాబాద్, జేఎన్‌టీయూ అనంతపురం, వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి హైదరాబాద్, వర్ధమాన్ రంగారెడ్డి, వీఆర్ ఆఫ్ సిద్దార్థ విజయవాడ, విజ్ఞాన్ ఇన్‌ఇబ్రహీంపట్నం, గోకరాజు రంగరాజు హైదరాబాద్‌లో సైన్స్ భువనగిరి చోటు పొందింది.
- 201-300 మధ్య: ఆదిత్య ఇన్‌ఇడియేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ టెక్కలి, ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం, సీఎంఆర్ హైదరాబాద్, జీ నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్, జీఎంఆర్ సైన్స్ రాజాం, గోదావరి రాజమహేంద్రవరం, ఇండియన్ ఇన్ ఆఫ్ పెట్రోల్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మదనపల్లె, మల్లారెడ్డి హైదరాబాద్, ఎంఎల్‌ఆర్ హైదరాబాద్, నిట్ తాడేపల్లిగూడెం, పీవీ సిద్దార్థ విజయవాడ, క్యూఐఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఒంగోలు, రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, శ్రీవిద్యా నికేతన్ తిరుపతి, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి, శ్రీవెంకటేశ్వర్ చిత్తూరు ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖపట్నం.