
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (80), షెఫాలీ వర్మ (79), రిచా ఘోష్ (40*), హర్మన్ ప్రీత్ కౌర్ (16*) దూకుడుగా ఆడారు. లంక బౌలర్లలో షెహాని, మధుషని చెరో వికెట్ తీశారు. ఈ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఇంతకుముందు విండీస్‌పై 2024లో భారత్ 217/4 స్కోరు చేసింది.
పోటాపోటీగా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు అద్భుతమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ పోటాపోటీగా బౌండరీల వర్షం కురిపించారు. తొలి వికెట్‌కు 162 పరుగులు జోడించారు. ఈ ఆశ శతకాలు చేస్తారని భావించినా.. స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. మహిళల క్రికెట్‌లో 10 వేల పరుగులు చేసి నాలుగో బ్యాటర్‌గా స్మృతి సాధించాడు. మరోవైపు, షెఫాలీ వరుసగా మూడో హాఫ్ సెంచరీని నమోదు చేసింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రిచా ఘోష్ దూకుడుగా ఆడింది. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 40 పరుగులు రాబట్టింది. హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి రిచా మూడో వికెట్‌కు 23 బంతుల్లోనే 53 పరుగుల భాగస్వామ్యం నిర్మించింది.