India Ancient Temple: 800 ఏళ్ల మన్నార్ రాజగోపాల్ స్వామి టెంపుల్.. 11 ప్రదక్షిణలు చేస్తే..! |


చివరిగా నవీకరించబడింది:

భారతదేశ పురాతన ఆలయం: విజయనగరం పట్టణం లో వెలిసినటువంటి శ్రీ శ్రీ శ్రీ శ్రీ మన్నార్ రాజగోపాల్ స్వామి వారి ఆలయం 800 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన రాతి కట్టడంతో ఉన్నటువంటి ఆలయం అని ఆలయ ప్రధాన అర్చకులు మణి బాబు తెలియజేశారు.

+

800

800 ఏళ్ల చరిత్ర కలిగిన మన్నార్ రాజగోపాల్ స్వామి ఆలయం విశిష్టత ఇదే

భారతదేశ పురాతన దేవాలయం: విజయనగరం పట్టణం లో వెలిసినటువంటి శ్రీ శ్రీ శ్రీ శ్రీ మన్నార్ రాజగోపాల్ స్వామి వారి ఆలయం 800 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన రాతి కట్టడంతో ఆలయం ఉన్నటువంటి ఆలయం అని ప్రధాన అర్చకులు మణి బాబు తెలియజేశారు. ఇది పూరి నుండి అటు రామేశ్వరం వరకు ఇటువంటి శిల్పకళలతో ఉన్న దేవాలయం ఉన్న దేవాలయం లేదని చెప్పడంలో అతిశయోక్తి కాదని ఆయన తెలియజేశారు.స్థానికంగా సంతాన గోపాల స్వామి, ఆలయం అని పిలుస్తారు అని వెల్లడి చేశారు.ఆలయంలోకి ప్రవేశించగానే, 40 స్తంభాలతో ఉన్న ఆస్థాన మండపం కనిపిస్తుంది. ఆ స్తంభాల పైన చిన్న శిల్పాలు మరియు గోడల చుట్టూ రామాయణాన్ని వర్ణించే ఇటీవలి చిత్రాలు ఉన్నాయి.

మన్నార్ రాజగోపాల్ స్వామి టెంపుల్..

అసలైన పాత గుడి 1000 సంవత్సరాల పురాతనమైనది. అది విజయనగరం శివర్లలోని వేణుగోపాలపురంలో ఉండేది. పిడుగు పడడంతో దానిపై ఆ ఆలయం పాడైంది. ఆ తర్వాత, 800 సంవత్సరాల క్రితం, మరింత సుందరమైన వాస్తుశిల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.లోపలికి ప్రవేశించగానే, అంతరాలయం మరియు గర్భగృహానికి దారితీసే అందమైన స్తంభాల గది మనకు కనిపిస్తుంది. ద్వారం ఎడమ వైపున చక్రం మరియు విశ్వక్సేనుడు ఉన్నారు. కుడి వైపున శంఖు మరియు హనుమంతుడు ఉన్నాడు.మిగత అంతా నునుపుగా ఉన్న గుండ్రని స్తంభాల పైభాగంలో పనితనం ఉంది.గర్భగృహంలో రాజగోపాల (కృష్ణుడు) రుక్మిణి ,సత్యభామ మూర్తులు ఉన్నారు.వైష్ణవ సంప్రదాయమైన పంచరాత్ర ఆగమం ప్రకారం ఆచారాలు నిర్వహించే ఈ ప్రాంతంలోని ఏకైక ఆలయం కూడా ఇదే అని తెలిపారు.

11 ప్రదక్షిణలు చేస్తే…

ఆలయంలోని వివాహాలు ఎన్నో జరిగాయి. ఎన్నో విశేషమైన కార్యక్రమాలు కూడా ఈ ఆలయంలో జరుగుతున్నాయని అన్నారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ధనుర్మాస ఉత్సవాలు ఎంతో అందంగా వైభవంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి ఎంతో కన్నులు విందుగా జరుగుతుందని తెలిపారు. ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే అనుకోని కోరుకు స్వామివారి నెరవేరిస్తారని ఎక్కడకొచ్చిన భక్తులకు ఆపారమైన నమ్మకం అని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మరల సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుందని ఆయన చెప్పారు. ఆలయ ప్రాంగణంలో పిల్లలు ఆడుకోవడానికి విశాలమైన పార్కు కూడా ఏర్పాటు చేశారు.

Googleలో న్యూస్18ని మీ ప్రాధాన్య వార్తల మూలంగా జోడించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవ్వండి.



Source link

Spread the love