India army Suside drones : భారత సైన్యంలోకి ఆత్మాహుతి డ్రోన్స్


భారత సైన్యానికి కొత్త అస్త్రం

భారతదేశ సైన్యం ఆత్మహత్య డ్రోన్లు : ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యానికి ఆత్మాహుతి డ్రోన్స్ (కామెకాజీ డ్రోన్స్) చేరాయి. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ వీటిని తయారు చేసి తాజాగా ఆర్మీకి అందజేసింది.

అత్యవసర ఒప్పందం

గత ఏడాది డిసెంబర్‌లో భారత సైన్యం ఈ డ్రోన్స్ కొనుగోలుకు సుమారు రూ.10 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. అత్యవసర ప్రాతిపదికన కంపెనీ కొద్ది నెలల్లోనే వందల సంఖ్యలో డ్రోన్స్ తయారు చేసి సైన్యానికి సరఫరా చేసింది. తీవ్ర చలితో కూడిన మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలలో కూడా ఇవి పనిచేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఇది కూడా చదవండి: Anupama Parameswaran: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నటి అనుపమ?

భారత సైన్యం ఆత్మహత్య డ్రోన్లు
భారత సైన్యం ఆత్మహత్య డ్రోన్లు

కామెకాజీ డ్రోన్స్ ప్రత్యేకత

ఈ డ్రోన్స్ ఏఐ ఆధారిత గైడెన్స్ వ్యవస్థతో పనిచేస్తాయి. ఇవి 2.5 కిలోల వరకూ పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు. గంటకు సుమారు 120 వేగంతో ప్రయాణిస్తూ 10 దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. శత్రు ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన మిషన్ల కోసం వీటిని వినియోగించనున్నారు.

హిందీ వార్తలు కూడా చదవండి: hindi.vaartha.com

పేపర్: epaper.vaartha.com

ఇది కూడా చదవండి:



Source link

Spread the love