ఇండియా ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ SUV హ్యుందాయ్ ఐయోనిక్ 5
ఫోటో: టైమ్స్ నౌ డిజిటల్
హ్యుందాయ్ IONIQ 5 భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త తరహా ఎలక్ట్రిక్ SUVగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ వాహనం ఆధునిక డిజైన్, స్మార్ట్ ఫీచర్లు, పర్యావరణహిత పదార్థాలతో తయారైన ఇంటీరియర్‌ల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఫ్లాట్ ఫ్లోర్ కేబిన్, స్లైడింగ్ కన్సోల్, రెక్లైనింగ్ సీట్లు లాంటి సౌకర్యాలు లౌంజ్ అనుభూతిని కలిగిస్తాయి. రెండు డిజిటల్ స్క్రీన్లు, 60కి పైగా సేఫ్టీ ఫీచర్లు , వాహనం-టు-లోడ్ సిస్టమ్ ద్వారా పరికరాలకు నేరుగా కార్ ఆధారంగా పవర్ అందించే సామర్థ్యం ఉంది. అధిక రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ తో దూర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది . ఫ్యూచర్ డిజైన్, కంఫర్ట్ , స్పీడ్ , టెక్నాలజీ తో ఈ SUV భారత EV మార్కెట్లో ప్రత్యేక వాటిని సంపాదిస్తోంది.
హ్యుందాయ్ IONIQ 5 ఎలక్ట్రిక్ కార్
హ్యుందాయ్ IONIQ 5 భారతీయ మార్కెట్లో ఒక ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ SUVగా నిలుస్తోంది. ఇది ఆధునిక డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, స్మార్ట్ టెక్నాలజీ, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది.
72.6 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది . ఇది 217 PS, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్ తో ఉంటుంది . ARAI సర్టిఫైడ్ రేంజ్ 631 km ఇస్తుంది .

ఫీచర్స్
ఎక్స్‌టీరియర్‌లో LED లైటింగ్, 20 అంతలో అలాయ్ వీల్స్, 3,000 mm వీల్‌బేస్ SUVకి ఫ్యూచరిస్టిక్ లుక్ ఇస్తాయి. ఇంటీరియర్‌లో రెండు 12.3 డిజిటల్ స్క్రీన్లు లాంజ్, ఫ్లాట్ ఫ్లోర్, స్లైడింగ్ కన్సోల్, రెక్లైనింగ్ సీట్లు ఉంటాయి.

హ్యుందాయ్ స్మార్ట్ సెన్స్ ADASలో లైన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్ వంటి 21 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఆటో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ , కనెక్టెడ్ కార్ టెక్నాలజీ బ్లూలింక్ ద్వారా రిమోట్ కంట్రోల్, టైం రియల్ నావిగేషన్ అందిస్తుంది.

ఫ్రంట్ మెక్‌ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్, బ్యాక్ మల్టీ-లింక్ సస్పెన్షన్ వాహనానికి స్థిరత్వం, కంఫర్ట్ ను అందిస్తాయి. 527 లీటర్ల బూట్ స్పేస్‌ను 1,587 లీటర్ల వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. వెహికల్-టు-లోడ్ (V2L) సిస్టమ్ ద్వారా ల్యాప్‌టాప్, కాఫీ మెషిన్, స్కూటర్ వంటి పరికరాలను నేరుగా కార్ ఆధారంగా పవర్ అందించవచ్చు. ఛార్జింగ్ చూసుకుంటే 350 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 18 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ అవుతుంది. 11 kW AC ఛార్జింగ్‌తో పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 7 గంటలు పడుతుంది.

ధర
హ్యుందాయ్ IONIQ 5 ఎక్స్ షో రూమ్ ధర ₹46.3 లక్షలు.
హండాయ్ IONIQ 5 ఒక పర్యావరణహిత, సాంకేతికతతో అత్యంత వేగవంతమైన, అధునాతన SUV గా చెప్పుకోవచ్చు.