డీఏఈ సంస్థను అభివృద్ధి చేసి 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చిగా ఆవిర్భవించింది.
ఆ తరువాత కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విరియల్ లాంచింగ్ స్టేషన్ (టీఐఆర్‌ఎల్‌ఎస్)ని ఏర్పాటు చేశారు. 1963 నవంబర్ 21న ‘నైక్ అపాచి’ అనే రెండు దశల సౌండింగ్ రాకెట్‌ను మొదటిగా ప్రయోగించారు. ఆ తరువాత 1967 నవంబర్ 20న రోహిణి–75 అనే సౌండింగ్ రాకెట్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయం సాధించారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చి సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా మార్చారు. 1963లో తుంబా నుంచి వాతావరణ పరిశీలన కోసం సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది.
ఇందిరాగాంధీ హయంలో..

దేశానికి మంచి రాకెట్ కేంద్రాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ విక్రమ్ సారాబాయ్, స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ 1969లో తూర్పువైపు తీరప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. ఆ సమయంలో పులికాట్ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చ.కి.మీ. దూరం విస్తరించిన శ్రీహరికోట దీవి కనిపించింది. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీ అక్షాంశంలో ఉండటంతో రాకెట్ ప్రయోగానికి అనువుగా ఉంటుందని ఎంపిక చేశారు. భవిష్యత్తు రాకెట్ ప్రయోగాలను దృష్టిలో ఉంచుకుని వాతావరణ పరిశోధనకు సుమారు 1,161 సౌండింగ్ రాకెట్లు ప్రయోగించబడ్డాయి. ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 రాకెట్‌లతో 86 ప్రయోగాలు చేసి 116 ఉపగ్రహాలు, 13 స్టూడెంట్‌ల ఉపగ్రహాలు, రెండు రీఎంట్రీ మిషన్లు, 381 విదేశీ ఉపగ్రహాలు, మూడు ప్రయోగాలు, రెండు ప్రయోగాలు చేశారు.
ఆర్యభట్ట ఉపగ్రహంతోనే..

☛ 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని సొంతంగా తయారు చేసి రష్యా నుంచి ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల వేటను ఆరంభించారు.
☛ శ్రీహరికోట రాకెట్ కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి 1979 ఆగస్టు 10 ఎస్‌ఎల్‌వీ–3 ఇన్1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.
☛ 1980 జూలై 18న ఎల్వీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
☛ ఆ తరువాత జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఐదు టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాలను, మానవసహిత ప్రయోగాలకు ఉపయోగపడేలా జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 రాకెట్‌ను రూపొందించారు.
☛ ఆరు రకాల రాకెట్‌ల ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూరపరిశీలనా ఉపగ్రహాలు), ఖగోళాన్ని అధ్యయనం చేసే ఆస్ట్రోశాట్స్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ మంగళస్థం (భారతీయ క్షేత్రీయ దిక్చూచి ఉపగ్రహాలు, చంద్ర,1) చంద్రయాన్–2) లాంటి ప్రయోగాలను కూడా విజయవంతంగా ప్రయోగించారు.
భారతదేశంలోని ప్రధాన విపత్తులు : భారత దేశ చరిత్రలో జరిగిన పెను విషాదాలు ఇవే..
ప్రపంచదేశాల్లో భారత అంతరిక్ష పరిశోదన సంస్థకు ప్రత్యేక గుర్తింపు..

➤ 1992 మే 5న వాణిజ్యపరంగా పీఎస్‌ఎల్‌వీ సీ–02 రాకెట్ ద్వారా జర్మనీ దేశానికి చెందిన టబ్‌శాట్ అనే శాటిలైట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
➤ 35 దేశాలకు చెందిన 381 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచదేశాల్లో భారత అంతరిక్ష పరిశోదన సంస్థకు గుర్తింపు తెచ్చారు.
➤ న్యూస్‌పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్‌స్పేస్ అనే సంస్థలను ఏర్పాటు చేసి ప్రయివేట్‌గా ఉపగ్రహాలు, రాకెట్‌లను కూడా ప్రయోగించే స్థాయికి భారతీయ శాస్త్రవేత్తలు ఎదిగారు.
➤ న్యూస్‌పేస్ ఇండియా లిమిటెడ్ వారి సహాయంతో ఇటీవలే ఎల్‌వీఎం3–ఎం2 రాకెట్ ద్వారా వన్‌వెబ్ అనే కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను ప్రయోగించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ప్రయివేట్‌గా రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలతో పాటుగా గగన్‌యాన్–1, చంద్రయాన్–3, ఆదిత్య–ఎల్1 అనే చాలెంజింగ్ ప్రయోగాలను సిద్ధం చేస్తున్నారు.