
జగిత్యాల (విద్యానగర్): జగిత్యాల పట్టణంలోని గిరిజన బాలుర సంక్షేమ వసతిగృహంలో పలువురు విద్యార్థులను వంట సహాయకుడు చీపురుతో బాదిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం విచారణకు ఆదేశించారు. విద్యార్థుల నుంచి వివరాలు ఆరా తీసిన జిల్లా సంక్షేమాధికారి రాజ్‌కుమార్, నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. దీంతో వంటసహాయకుడు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మంత్రి లక్ష్మణ్‌కుమార్ సైతం ఆరా తీశారు. కొంతకాలంగా మద్యం మత్తులో దౌర్జన్యానికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై వార్డెన్ సైతం పలుమార్లు మందలించినట్లు తెలిసింది.