Kalvakuntla Kavitha: నడిగడ్డ నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెడతా: కల్వకుంట్ల కవిత


ప్రసంగిస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవిత, చిత్రంలో ఎన్‌హెచ్‌పీఎస్‌ ఛైర్మన్‌ రంజిత్‌కుమార్‌

గద్వాల కలెక్టరేట్, న్యూస్‌టుడే: జోగులాంబ అమ్మవారంటే తనకు సెంటిమెంట్‌ అని, త్వరలో రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడే మొదలు పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రైతు సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగించారు. రాజకీయ ప్రస్థానానికి ఆయుధం సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని, రైతులు మద్దతు ఇవ్వాలని కోరారు. మీ నాయకుడు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఛైర్మన్‌ రంజిత్‌కుమార్‌ను ఎన్నికల్లో ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. తాను భారాస నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదిలేశానని, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సైతం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సీడ్‌ పత్తి రైతుల బకాయిలను వారం రోజుల్లో కంపెనీలు చెల్లించాలని, లేదంటే రైతు సంఘాల నాయకులను ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.



Source link

Spread the love