Kamareddy: కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత


కామారెడ్డి: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వచ్చారు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహేందర్‌రెడ్డి కారును భాజపా కార్యకర్తలు ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.



Source link

Spread the love