
కందకుర్తి: నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ జన్మస్థానం నాగ్‌పూర్ అని, ఆయన పూర్వీకుల స్వస్థలం కందకుర్తి అని అన్నారు. ‘‘ కందకుర్తిలో కేశవ మందిర నిర్మాణం కోసం 35 ఏళ్ల క్రితం బీజం పడింది. ఈ మందిరాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరం. భరతమాత విముక్తి కోసం హెడ్గేవార్ సంఘ్ ఏర్పాటు చేశారు. ఆయన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. హిందూ సమాజంలో ఐక్యత కోసం జీవితాన్ని ధారపోసిన వ్యక్తి. ఆర్‌ఎస్‌ఎస్ ఎవరికీ వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థ కాదు. కందకుర్తి దేశానికి స్ఫూర్తి కేంద్రంగా మారింది. ప్రతి భారత పౌరుడు కందకుర్తిని సందర్శించి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.