Karimnagar: ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం


కరీంనగర్: భారీ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. తహసీల్దార్‌గా పని చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్న అధికారిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండల తహసీల్దార్‌గా పని చేస్తున్న కమతం శ్రవణ్‌కుమార్‌, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై కరీంనగర్‌లోని హిందూపూర్‌ కాలనీలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిందితుడి నివాసంతో పాటు మరో 2 ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, బంగారు ఆభరణాలు, నగదు విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.



Source link

Spread the love