KCR: నన్ను ఎర్రవల్లిలో విచారణ చేయండి: సిట్‌కు కేసీఆర్‌ ప్రత్యుత్తరం


హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో విచారణకు రావాలని సిట్‌ ఇచ్చిన నోటీసులకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ స్పందించారు. సిట్ నోటీసులకు కేసీఆర్ ప్రత్యుత్తరం పంపారు. శుక్రవారం విచారణ రాలేనని పోలీసులకు తెలిపారు. తనను ఎర్రవల్లిలో విచారణ చేయాలని కోరారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు రేపే చివరి తేదీ అయినందున విచారణకు రాలేనని వివరించారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్‌ వెల్లడించారు. 160 సీఆర్‌పీసీ కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలన్న నిబంధనలు లేవని పేర్కొన్నారు. భవిష్యత్తులో నోటీసులన్నింటిని ఎర్రవల్లికే పంపాలని ప్రత్యుత్తరంలో కేసీఆర్‌ కోరారు.

స్పందించిన సిట్‌

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో విచారణకు రావాలనే తమ ఆదేశాలకు కేసీఆర్‌ ఇచ్చిన సమాధానంపై సిట్‌ స్పందించింది. తేదీ, విచారణ ప్రదేశంపై న్యాయ సలహా తీసుకుని మరో నోటీసు ఇవ్వనుంది. రేపు విచారణకు హాజరుకాలేనన్న కేసీఆర్‌ విజ్ఞప్తిని సిట్ అంగీకరించింది. ఎర్రవల్లిలో విచారణ చేయాలనే కేసీఆర్‌ విన్నపంపై సిట్ న్యాయ సలహా తీసుకోనుంది. ఆ తర్వాత మరో నోటీసును కేసీఆర్‌కు ఇవ్వనుంది.



Source link

Spread the love