
కామారెడ్డి: ఫోన్ ట్యాపింగ్ కేసుపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ కేసులో ఎంతటి వారున్నా శిక్ష తప్పదన్నారు. సిట్ విచారణపై హరీశ్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ మాట్లాడారు. దేశంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు అతిపెద్ద నేరమని వ్యాఖ్యానించారు. టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. తన ఫోన్, షబ్బీర్ అలీ సహా చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై రాజకీయ వేధింపులకు పాల్పడే ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.