Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షోలకు రూ.500.. ఆ తర్వాత పది రోజులు సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, తెలంగాణలో ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల జీవోను హైకోర్టు సస్పెండ్ చేయడంతో, ఇక్కడ రేట్లు పెంచడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. జనవరి 11న ప్రీమియర్ షోలు వేసుకోడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్లకు జీఎస్టీతో కలిపి టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ స్పెషల్ షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక జనవరి 12వ తేదీ నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే రోజుకు 5 షోలు వేసుకోడానికి పర్మిషన్స్ ఇచ్చింది.
‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి ఏపీలో టికెట్ రేట్స్ హైక్ లభించినప్పటికీ, తెలంగాణాలో కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ది రాజాసాబ్’ సినిమాకి టికెట్ ధరలు పెంచుకోడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమాకి ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
