Medak Collector: కోర్టు ధిక్కరణ కేసులో మెదక్‌ కలెక్టర్‌కు జైలు శిక్ష


హైదరాబాద్‌: కోర్టు ధిక్కరణ కేసులో మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌కు జైలుశిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనకు హైకోర్టు ఆరు నెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అనంతరం తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపివేసింది. అప్పీలు చేసుకునేందుకు కలెక్టర్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఓ భూవివాదం కేసులో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ పట్టించుకోలేదని ఆరోపిస్తూ మెదక్‌ జిల్లా బోనాల్‌ గ్రామానికి చెందిన లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.



Source link

Spread the love