- పవన్ కళ్యాణ్ పై అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు
- రాజకీయాలను సినిమాలతో పోల్చిన ఎమ్మెల్యే సెటైర్లు
- తెలంగాణపై పవన్ పాత వ్యాఖ్యలను గుర్తుచేసిన కాంగ్రెస్ నేత
- తెలంగాణలో జనసేన రాజకీయాలకు ఫ్లాప్ తప్పదని జోస్యం

Jadcherla MLA Anirudh Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తావన మరోసారి చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌ను ఒక “నటుడు”గా అభివర్ణిస్తూ, ఆయన రాజకీయ విజయాల వెనుక ఎప్పుడూ ఒక “నిర్మాత” (ప్రొడ్యూసర్) ఉంటారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత బలంతో కాకుండా, ఇతర పార్టీల అండతోనే రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
Samsung 55inch TV ఆఫర్: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని సినిమాలతో పోలుస్తూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్మాత లేకుండా, అంటే ఒంటరిగా బరిలోకి దిగారని, అందుకే ఆయన దారుణంగా విఫలమై ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని గుర్తు చేశారు. అయితే, 2024 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడును “ప్రొడ్యూసర్”గా, నారా లోకేష్‌ను “కో-ప్రొడ్యూసర్”గా పెట్టుకుని గెలిచారని. ఇప్పుడు ఏపీలో మంత్రి పదవి వచ్చినా అది సరిపోవడం లేదనే భావనలో పవన్ ఉన్నారని, అందుకే తన రాజకీయ చిత్రాన్ని తెలంగాణకు విస్తరించేందుకు ప్రధాని మోదీ అనే కొత్త నిర్మాత వెతుక్కున్నారని, ‘మోడీ ప్రొడక్షన్స్’లో అడుగుపెట్టాలని చూస్తున్నారని అనిరుధ్ రెడ్డి సెటైర్లు వేశారు.
తెలంగాణ ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా అనిరుధ్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలది “నరదిష్టి” అని, మన కళ్లు మంచివి కావని పవన్ కళ్యాణ్ గతంలో అన్నారని, అలాంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. మన రాష్ట్ర ప్రజల కళ్లు మంచివి కావని అన్న వ్యక్తి పార్టీ నుండి ఇక్కడ అభ్యర్థులు ఎలా పోటీ చేస్తారని నిలదీశారు. తెలంగాణలో భూముల రేట్లు విపరీతంగా పెరగడం వల్లే ఆంధ్ర నాయకుల కన్ను మన రాష్ట్రంపై పడిందని, అందుకే వివిధ కారణాలతో ఇక్కడికి రావాలని ఆయన కోరారు.
పవన్‌ను “ప్యాకేజీ స్టార్” అని ఎద్దేవా చేస్తూ, ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని చూడటం ఒక “హై బడ్జెట్” సినిమా లాంటిదని అనిరుధ్ రెడ్డి కళ్యాణ్. ఒక్కోసారి వెయ్యి కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోర్ల పడి, కేవలం 50 కోట్లు కూడా వసూలు చేయలేవని, పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమా కూడా తెలంగాణలో ఫ్లాప్ అవుతుందని జోస్యం చెప్పారు. ఆంధ్రా నేతల కన్ను మన భూములపై పడకుండా తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని, ఇక్కడి వారు అమాయకులు కాదని అనిరుధ్ రెడ్డి ప్రకటించారు.
boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్‌బ్యాండ్ కేవలం రూ.999కే..!