News Updates: వారందరికీ రిలీఫ్.. ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు.. ప్రభుత్వ ప్రకటన |


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపల వేటకు వెళ్లే వారికి ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు బీమా పరిహారాన్ని రూ.10లక్షలకు పెంచింది. ఇప్పటివరకూ ఈ పరిహారం రూ.2లక్షలుగానే ఉంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద ఈ పరిహారం ఇస్తారు. ఐతే.. ఈ పరిహారం పొందాలంటే.. చేపలవేటకు వెళ్లేందుకు లైసెన్స్ కలిగివుండాలి, మత్స్యకార సహకార సంఘాల సభ్యులుగా ఉండాలి. అలాంటి వారి కుటుంబ సభ్యులకే పరిహారం ఇస్తారు. అసలే మన బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంటుంది. అందులో చేపల వేటకు వెళ్లడం సాహసమే. అందువల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని మత్స్యకారులు స్వాగతిస్తున్నారు.

వికారాబాద్ జిల్లా.. పరిగి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటిస్తారు. అమరావతి, ఉద్దండరాయునిపాలెంలో క్వాంటమ్ వ్యాలీకి ఇవాళ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. నేడు ఛలో గుంటూరుకి వైసీపీ పిలుపిచ్చింది. నేడు ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. మావోయిస్తులపై ఫైనల్ ప్లాన్ రెడీ చేస్తారు. నేడు, రేపు హైదరాబాద్‌లో 137 రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం ఉంటుంది. బృహన్‌ముంబై కార్పొరేషన్ బీజేపీ మేయర్ అభ్యర్థి ప్రకటన నేడు ఉంటుంది. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థల రైడర్లు నేడు బంద్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతోంది. నేడు భారత్-యూఎస్ఏ మ్యాచ్ ఉంది. వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. నేడు రోజ్ డే ఉంది. విశ్వక్ సేన్, కయాదు లోహార్ మూవీ ‘ఫంకీ’ ట్రైలర్ సాయంత్రం రిలీజ్ అవుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ ఆరెంజ్ నేడు రీ-రిలీజ్ అవుతోంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love