PM Kisan Yojana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్…పీఎం కిసాన్ యోజన డబ్బులతో పాటు తెలంగాణ రైతు భరోసా డబ్బులు లభించే అవకాశం.. pm kisan yojana: good news for telangana farmers; there is a possibility of receiving telangana rythu bharosa funds along with the pm kisan yojana money.


pm కిసాన్ యోజన

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద ఈ ఏడాది విడుదల చేయాల్సిన తొలి విడత డబ్బులను అతి త్వరలోనే రైతుల ఖాతాలో నేరుగా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మొత్తం 22 విడతలుగా డబ్బులను నేరుగా జమ చేసింది. ఇప్పుడు విడుదల చేయబోయే విడత 23వది కావడం విశేషం. ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం 6000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తోంది. ఈ 6000 రూపాయలను ఒకసారి కాకుండా మొత్తం సంవత్సరానికి మూడుసార్లు రెండువేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో డైరెక్ట్ టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వారి బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది.

రైతులు ఈ డబ్బులను తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యోజన కింద అందిస్తున్నటువంటి ఈ ప్రయోజనం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఈ డబ్బులను రైతులు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఖర్చులకోసం కానీ, వ్యవసాయ ఇతర ఖర్చులకోసం కానీ ఈ డబ్బులను ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని సబ్సిడీ రూపంలో కానీ, అలాగే రుణ సహాయ రూపంలో కానీ భావించకూడదు. ఈ డబ్బులు రైతులు తమకు నచ్చినట్లుగా వాడుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి నేటి వరకు ఈ పథకం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ప్రయోజనం ద్వారా దాదాపు పది కోట్ల మందికి పైగా రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతోంది.

అయితే నిజానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సహాయం వల్ల ప్రస్తుతం రైతులకు నేరుగా ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తోపాటు అటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతులకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చే పథకాలను అందుబాటులో ఉంచాయి.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12 వేల రూపాయలను రైతులకు అందజేయనున్నారు. ఈ పథకాన్ని కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చేందుకు వారి ఖాతాలో వేయనుంది. తెలంగాణ రైతులకు ఈ రెండు పథకాలను అమలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది అని చెప్పవచ్చు.



Source link

Spread the love