Property Tax: తెలంగాణ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో.. రూ.685 కోట్ల ఆస్తి పన్ను వసూలు


హైదరాబాద్‌: తెలంగాణలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.685 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలైంది. క్యూర్‌ పరిధి బయటి ఈ పట్టణాలు, నగరాల్లో 2024-25తో పోలిస్తే రూ.68 కోట్లమేర ఆస్తి పన్ను వసూళ్లు పెరిగాయి. మంచిర్యాల, రామగుండం, నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మంలో ఆస్తిపన్ను ఆదాయం పెరిగింది. కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్గొండలో తగ్గింది. హుజురాబాద్‌, జమ్మికుంటలో 100 శాతం ఆస్తిపన్ను వసూలైంది.



Source link

Spread the love