Putin India Visit: ఆహారం, నీరు, బాత్‌రూమ్‌ అన్నీ రష్యా నుంచే: విదేశీ పర్యటనల్లో పుతిన్‌ భద్రత ఇలా..


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరో రెండు రోజుల్లో భారత్‌కు రానున్నారు. డిసెంబరు 4-5 తేదీల్లో ఆయన మన దేశంలో ఉండనున్నారు. కొన్ని వారాల నుంచే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పుతిన్ పర్యటనలో అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత ఉండనుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆయన భారత్‌లో ఉన్నంతసేపు తినే తిండి, తాగే నీరు రష్యా నుంచే తీసుకొస్తారట. చివరకు పుతిన్ ఉపయోగించే టాయిలెట్‌ను కూడా స్వదేశం నుంచే మోసుకొస్తారు. మరి విదేశీ పర్యటనల సమయంలో పుతిన్‌కు భద్రతా ఏర్పాట్లు ఎలాగో చూద్దాం..!

మొబైల్ ఫోన్ వాడరు..

  • విదేశీ పర్యటనల్లో పుతిన్‌ భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలను ప్రెసిడెన్షియల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ చూసుకుంటుంది. వీరు అధ్యక్షుడి రాకకు నెల రోజుల ముందే ఆతిథ్య దేశానికి అక్కడ పుతిన్ ఉండే హోటల్‌ను క్షుణ్ణంగా వెళ్లి తనిఖీ చేస్తారు. ఈ బృందంలో ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌, ఫారిన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ వంటి విభాగ అధికారులు ఉంటారు.
  • పుతిన్‌ రావడానికి ముందే ఆయన ఉపయోగించే సబ్బులు, షాంపూలు, హ్యాండ్‌వాష్‌, టూత్‌పేస్ట్ వంటి వాటిని రష్యా నుంచి తీసుకొచ్చి హోటల్‌లో ఏర్పాటు చేస్తారు.
  • రష్యా అధ్యక్షుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించారు. కేవలం సెక్యూర్ కమ్యూనికేషన్‌ లైన్‌లోనే సంభాషిస్తారు. హోటల్‌ గదిలో ప్రత్యేకంగా టెలిఫోన్‌ బూత్‌ను ఏర్పాటుచేస్తారు.
  • హోటల్‌లో ఉన్న సమయంలో పుతిన్ అక్కడి బాత్రూమ్‌ను కూడా వినియోగించారు. ఆయన కోసం రష్యా నుంచి మొబైల్ బాత్రూమ్ తీసుకొచ్చి గదిలో అమర్చారు.

ఎగిరే క్రెమ్లిన్.. ఈ విమానం

  • ఇల్యూషిన్‌ ఐఎల్‌-96-300పీయూ విమానంలో పుతిన్‌ ప్రయాణిస్తారు. దీన్ని ‘ఎగిరే క్రెమ్లిన్’గా అభివర్ణిస్తారు. ఈ విమానంలో పలు సమావేశ గదులు, కాన్ఫరెన్స్‌ రూమ్‌, పడకగది, బార్‌, జిమ్‌, మెడికల్ రూమ్‌ ఉంటాయి.
  • విమానం లోపల మొత్తం బంగారు పూసి ఉంటుంది. ఒకేసారి 262 మంది ఇందులో నటించొచ్చు. పుతిన్ ప్రయాణిస్తున్న సమయంలో యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా వెళ్తాయి.
  • ఈ విమానంతో పాటు ఒకటి లేదా రెండు విమానాలు బ్యాకప్‌గా ఉంటాయి. విదేశాల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే.. అదనంగా తీసుకొచ్చిన విమానంలో పుతిన్ తిరిగేస్తారు. రష్యా అధ్యక్షుడి విమానానికి మరమ్మతులు చేసేందుకు విదేశీ టెక్నీలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోరు.
  • పుతిన్‌తో పాటు దాదాపు 100 మంది భద్రతా సిబ్బంది, సహాయకులు పర్యటనలో ఉంటారు. వీరంతా పర్యటనకు ముందు రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంటారని గతంలో ఓ భద్రతా ఏజెంట్‌లో ఉన్నారు.

గాల్లోనే కమాండ్ పోస్ట్..

  • పుతిన్‌ విమానం పేరు ఇల్యూషిన్‌ ఐఎల్‌-96-300పీయూలోని పీయూ అంటే రష్యాలో పంక్త్‌ ఉపరవ్లేనియా. దీనర్థం కమాండ్ పోస్ట్.
  • ఈ విమానంలో క్లియర్‌ కమాండ్‌ బటన్‌ ఉంటుంది. అంటే గాల్లో ఉండగానే పుతిన్‌ అణ్వాయుధ వినియోగానికి ఆదేశాలు జారీ చేయొచ్చన్నమాట.
  • ఈ విమానం 43వేల అడుగుల ఎత్తులోనూ ప్రయాణించగలదు. గాల్లోనే రీఫ్యూయల్ చేసుకునే అవకాశం ఉంటుంది.

నాలుగు టైర్లు పంక్చర్‌ అయినా..

  • విదేశీల్లో పుతిన్‌ పర్యటన కారును కూడా రష్యా నుంచే తీసుకొస్తారు. దాని పేరు ఆరస్ సెనెట్. 2018 నుంచి ఇది పుతిన్‌ వ్యక్తిగత కాన్వాయ్‌లో భాగంగా ఉంది.
  • ఈ కారు సేఫ్టీ ఫీచర్లను అత్యంత రహస్యంగా ఉంచుతారు. బుల్లెట్లు, గ్రెనెడ్లు, రసాయన దాడులను ఇది తట్టుకోగలదు. నాలుగు టైర్లు పంక్చర్‌ అయినా ఇది ఉపయోగించగలదు.
  • ఇందులో ఎమర్జెన్సీ ఆక్సిజన్‌ ​​సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. గంటకు 249 వేగంతో ప్రయాణిస్తుంది. మినీ ప్రిజ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ కూడా ఉంటాయి.
  • చైనాలో ఎస్సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ.. పుతిన్‌తో కలిసి ఈ కారులో ప్రయాణించారు. గతంలో ఇదేతరహా కారును ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు పుతిన్‌ బహుమతిగా ఇచ్చారు.

పోర్టబుల్ ప్రయోగశాల..

  • విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు పుతిన్ తినే ఆహార పదార్థాలు, తీసుకునే డ్రింక్స్‌ను రష్యా నుంచే తీసుకొస్తారు. అన్నీ వండేందుకు ప్రత్యేక వంటవాళ్లు, హోటల్ సిబ్బంది కూడా మాస్కో నుంచి వస్తారు.
  • రష్యా అధ్యక్షుడు బస చేసే హోటల్‌లో ఆయన సెక్యూరిటీ బృందం ప్రత్యేకంగా క్రెమ్లిన్ చెఫ్ కోసం లిఫ్ట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆహారం వండిన తర్వాత దాన్ని తనిఖీ చేయడానికి ఓ మొబైల్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్..

  • పుతిన్ చుట్టూ ఎల్లప్పుడూ నాలుగంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. బహిరంగ కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ లెట్ ప్రూఫ్ జాకెట్‌ను ధరిస్తారని గతంలో మాస్కో టైమ్స్‌లో ప్రదర్శించారు.
  • పుతిన్‌కు దగ్గరగా ఉండే గార్డుల చేతిల్లో బ్రీఫ్‌కేస్‌ ఉంటుంది. అది తెరిస్తే షీల్డ్‌లా మారుతుంది. వారి చేతిలో ఉండే తుపాకీ నిమిషానికి 40 రౌండ్లు పేల్చగలదు. రష్యా అధ్యక్షుడి బాడీగార్డులు 35 ఏళ్ల వయసులోనే రిటైర్‌ అవుతారట.



Source link

Spread the love