Ramachander Rao: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్ట్‌


హైదరాబాద్‌: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు రామచందర్‌రావు యత్నించగా.. పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన బయల్దేరడంతో అరెస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా రామచందర్‌రావు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు భాజపా కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



Source link

Spread the love