Raptee HV T30 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర భారతదేశ రేంజ్ ఫీచర్లు నెక్స్ట్ జెన్ ఎలక్ట్రిక్ బైక్‌లు 2026 ||200km రేంజ్ ఇచ్చే తొలి హై వోల్టేజ్ Raptee HV T30 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్…ఈ నెక్స్ట్ జెన్ బైక్ ధర లేటెస్ట్ ఫీచర్స్


రాప్టీ HV T30 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

రాప్టీ HV T30 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

ఫోటో: టైమ్స్ నౌ డిజిటల్

Raptee HV సంస్థ భారతదేశంలో తమ మొదటి హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ T30 డెలివరీలను ప్రారంభించింది. చెన్నైలో మొదటి కస్టమర్లకు బైక్‌లు అందించడం ద్వారా ఈ స్టార్టప్ తన ఏడు సంవత్సరాల పరిశోధన , అభివృద్ధి ప్రయాణాన్ని సేల్స్ దిశగా అడుగులు వేసింది . ఈ మోడల్‌లో కార్లలో ఉపయోగించే హై వోల్టేజ్ HV-Tec ఆర్కిటెక్చర్‌ను ప్రవేశపెట్టారు. దీని వల్ల స్పీడ్ ఛార్జింగ్, హై పెర్ఫార్మన్స్, పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో సులభంగా అనుసంధానం చేస్తుంది . Raptee T30 ప్రారంభం సంస్థకు ఒక కీలక మైలురాయిగా నిలిచిందని చెప్పుకోవచ్చు .ఎందుకంటే ఇది ప్రొడక్ట్ వాలిడేషన్ దశ నుంచి పూర్తి స్థాయి రిటైల్ ఆపరేషన్ల దిశగా తీసుకువెళ్లింది . రాప్టీ యొక్క మొదటి ఆపరేషనల్ మార్కెట్‌గా నిలిచింది . అక్కడ డెలివరీలు , సర్వీస్ సౌకర్యాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సంస్థ త్వరలో బెంగళూరులో కూడా షోరూమ్ ప్రారంభించనుంది. ఈ ప్రారంభం Raptee HV ను భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్లో ఒక కొత్త శక్తివంతమైన సంస్థగా నిలుపనుంది .

రాప్టీ HV T30

దీని ఆధునిక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ డిజైన్, పెర్ఫార్మన్స్, సేఫ్టీ, కనెక్టివిటీ పరంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్ స్టైల్ డిజైన్ రైడర్‌కు ఆకర్షణీయమైన లుక్ ఇస్తుంది. Raptee T30 135 km/h టాప్ స్పీడ్ అందిస్తుంది. 0–60 km/h వేగాన్ని కేవలం 3.5 సెకన్లలో చేరుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ.

రాప్టీ HV T30 పనితీరు
రాప్టీ HV T30 పనితీరు

ఫీచర్స్

7 ఇక్కడ TFT టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్ ఉంటుంది.కనెక్టివిటీ ఫీచర్లు Raptee OS ద్వారా అందించబడుతుంది. రియల్ టైమ్ వెహికల్ డయాగ్నస్టిక్స్, రైడ్ ఇన్‌సైట్‌లు, ఛార్జింగ్ ఇన్‌సైట్‌లు, OTA అప్‌డేట్స్, రాప్టీ మ్యాప్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మొబైల్ కనెక్టివిటీ ద్వారా కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్ చేయవచ్చు.

రాప్టీ HV T30 ఫీచర్లు
రాప్టీ HV T30 ఫీచర్లు

Find My Raptee, Ping My Raptee వంటి ఫీచర్లు వాహనాన్ని సులభంగా గుర్తించడానికి సహాయపడతాయి.కన్వీనియన్స్ పరంగా స్మార్ట్ కీ ఫాబ్, పార్క్ అసిస్ట్, ట్రిప్ ప్లానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రాప్టీ HV T30 లుక్
రాప్టీ HV T30 లుక్

ఛార్జింగ్ కూడా చాలా సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది . పబ్లిక్ CCS2 కార్ ఛార్జింగ్ స్టేషన్లలో 20–80% ఛార్జ్ కావడానికి 36 నిమిషాలు పడుతుంది. ఇంటి వద్ద పోర్టబుల్ ఛార్జర్‌తో అదే స్థాయి ఛార్జ్ కావడానికి 1 గంట సమయం పడుతుంది.

రాప్టీ HV T30
రాప్టీ HV T30

సేఫ్టీ పరంగా హై వోల్టేజ్ టెక్నాలజీతో రైడర్‌కు పూర్తి రక్షణ కల్పిస్తుంది. డిస్క్ బ్రేక్స్ డ్యూయల్ ఛానల్ అబ్స్ తో ,రేడియల్ ట్యూబ్ లెస్ టైర్స్ , బ్యాటరీ మానేజ్మెంట్ సిస్టం ,IP67 ప్రొటెక్షన్ ఉంటుంది . అదనంగా 1 సంవత్సరం రోడ్‌సైడ్ అసిస్టెన్స్, డోర్‌స్టెప్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.బ్యాటరీ 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ వారంటీతో వస్తుంది. వాహనానికి 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ వారంటీ ఉంటుంది.

ధర

మొత్తం మీద Raptee T30 ఒక హై-పర్ఫార్మెన్స్, స్మార్ట్, సేఫ్, కన్వీనియంట్ ఎలక్ట్రిక్ బైక్‌గా నిలుస్తుంది. దీని ధర ₹2,39,000 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. ఇది నెక్స్ట్ బెన్ రైడింగ్ అనుభవాన్ని అందించే ఒక పవర్ ఫుల్ బైక్ గా చెప్పుకోవచ్చు .



Source link

Spread the love