రేవంత్ రెడ్డి: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర విషయాల గురించి చాలా చర్చించినట్లు.
ఇక.. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు వేం నరేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన కేసీ వేణుగోపాల్‌కు వేం నరేందర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని అభినందించారు ఖర్గే.