Revanth Reddy Congratulates Civils Winners,సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ తేజాలు.. 51 మంది ఇంటర్వ్యూల్లో 20 మంది విజయం – 22 aspirants selected in upsc civils final results 2025 from telangana cm revanth reddy congratulates winners


తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలంగాణ అభ్యర్థులు మెరిశారు. తెలంగాణ నుంచి ఏకంగా 20 మంది అభ్యర్థులు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇక సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ ఆర్థికంగా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

సివిల్స్ ఫలితాలు.
సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ తేజాలు.. 51 మంది ఇంటర్వ్యూల్లో 20 మంది విజయం(ఫోటోలు– Samayam Telugu)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది సివిల్స్‌లో 958 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇక తాజా సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మెరిశారు. ఇక తెలంగాణ నుంచి 20 మంది అభ్యర్థులు సివిల్స్ పరీక్షలో సత్తా చాటినట్లు వెల్లడైంది. సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ రిజల్ట్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా శుభాకాంక్షలు చెప్పారు.

యూపీఎస్సీ నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్ పరీక్షలు రాసే పేద అభ్యర్థులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద.. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయి.. మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్థిక సాయం చేస్తోంది. ఇక గతేడాది ఈ పథకం కింద సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన 202 మంది అభ్యర్థులకు రూ. ల‌క్ష ఆర్థిక సాయం ఇచ్చింది. వారిలో 51 మంది ఫైనల్ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ కాగా.. తాజాగా 20 మంది ఎంపికయ్యారు. ఈ అభ్యర్థులకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నగదును అందజేసింది.

ఇక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ 2025 తుది ఫలితాల్లో జనరల్‌ కేటగిరీ నుంచి 317 మంది ఎంపికయ్యారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 104, ఓబీసీ 306, ఎస్సీ 158, ఎస్టీ 73 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయినట్లు యూపీఎస్సీ తెలిపింది. సివిల్స్ పరీక్షల్లో అభ్యర్థుల మార్కులను 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని యూపీఎస్సీ స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్స్‌ 2025కు ఎంపికైన వారు

  • జశ్వంత్‌ చంద్ర – 23వ ర్యాంకు
  • సృజన – 55వ ర్యాంకు
  • భానోత్‌ లక్ష్మీ రచన – 178వ ర్యాంకు
  • డీఎస్‌కే ప్రచేత్‌ – 193వ ర్యాంకు
  • ఎస్‌ వర్షిత్‌ రెడ్డి – 259వ ర్యాంకు
  • ఎం.పవన్‌కుమార్ రెడ్డి – 297వ ర్యాంకు
  • వెలిమినేటి విక్రమసింహారెడ్డి – 541వ ర్యాంకు
  • గుమ్మల శ్వేత – 573వ ర్యాంకు
  • పల్లి ప్రమోద్‌ విష్ణు – 640వ ర్యాంకు
  • గుమ్మల విజయసింహారెడ్డి – 682వ ర్యాంకు
  • పోతుపురెడ్డి భార్గవ్‌ – 738వ ర్యాంకు
  • పుడారి రాహుల్‌ – 748వ ర్యాంకు
  • కుమ్మరి శ్రవణ్‌కుమార్‌ – 768వ ర్యాంకు
  • అనిరుధ్‌ కత్తిమాని – 786వ ర్యాంకు
  • కోరపోతుల శ్రీకర్‌రాజు – 806వ ర్యాంకు
  • ఇస్లావత్‌ శ్రీరామ్‌ హర్ష – 823వ ర్యాంకు
  • కట్టా ప్రత్యూష – 908వ ర్యాంకు
  • గోగుల రాజశేఖర్‌ – 920వ ర్యాంకు
  • గుగులోతు జితేందర్‌ నాయక్‌ – 939వ ర్యాంకు
శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్‌ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి