Ruturaj Gaikwads Century: రుతురాజ్ సూపర్ సెంచరీ.. సంపూర్ణ ఘన విజయం


సౌతాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన తొలి అనధికారిక వేదికలో భారత్-ఏ జట్టు(ఇండియా vs సౌత్ ఆఫ్రికా A) ఘన విజయం సాధించింది. గురువారం రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ) సెంచరీతో చెలరేగాడు. 286 పరుగుల టార్గెట్ సాధనలో గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రుతురాజ్ తొలి వికెట్‌కు 64 పరుగుల కీల‌క భాగ స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

గురువార జరిగిన ఈ అనధికారిక వన్‌లో టాస్ గెలిచింది.. బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా- ఏ(దక్షిణాఫ్రికా A) జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. డెలానో పోట్‌గీటర్(88), ఫోర్‌స్టర్‌ (77), ఫోర్‌టూయిన్‌ (59) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఇక భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్, హర్షిత్‌ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. ప్రసిధ్, నిశాంత్, రియాన్ పరాగ్, నితీశ్ రెడ్డి తలో వికెట్ తీశారు. అనంతరం 286 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. వరుస అంచనా అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ పెవిలియ‌న్‌కు చేరిన‌ప్పటికి.. రుతురాజ్(రుతురాజ్ గైక్వాడ్) మాత్రం త‌న ఏకాగ్ర‌త‌ను కోల్పోలేదు.

రుతురాజ్ ఆచితూచి ఆడుతూ 110 బంతుల్లో త‌న 16వ లిస్ట్‌-ఎ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 129 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌ 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి.. భారత్ స్కోర్ 219 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. రుతురాజ్‌(రుతురాజ్ గైక్వాడ్ ప్రదర్శన)తో పాటు కెప్టెన్‌ తిలక్‌ వర్మ(39), నితీశ్‌ కుమార్‌ రెడ్డి(37), నిశాంత్‌ సింధు(29) రాణించారు. మరోవైపు 50 ఓవర్ల ఫార్మాట్‌లో స్టార్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్‌ దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఔటయ్యాడు. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా మలచడంలో అభిషేక్(అభిషేక్ శర్మ) విఫలమయ్యాడు.


ఇవి కూడా చదవండి:

ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్

మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – నవంబర్ 14, 2025 | 07:06 AM



Source link

Spread the love