
సనత్‌నగర్: ఉత్తమ వైద్య కళాశాల, ఆసుపత్రిగా సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రికి అవార్డు దక్కింది. ఈఎస్‌ఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన, యువజన సర్వీసుల శాఖ మంత్రి మనసుఖ్ మాండవియా ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల డీన్ డాక్టర్ శిరీష్ కుమార్ చవాన్‌కు అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఉత్తమ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రుల జాబితాలో సనత్‌నగర్ కళాశాల ఆసుపత్రి మొదటి స్థానంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల ఆసుపత్రి రెండో స్థానంలో నిలిచాయి.