T20 ప్రపంచ కప్ 2026లో భారత్‌తో 61 పరుగుల తేడాతో ఓడిపోయిన మహ్మద్ యూసఫ్ పాకిస్థాన్ క్రికెట్ రాజకీయాలపై విరుచుకుపడ్డాడు.


మొహమ్మద్ యూసుఫ్: “మీ రాజకీయాలే ముంచేశాయ్”.. జట్టు ఓటమిపై పాకిస్థాన్ లెజెండరీ యూసఫ్ ఫైర్..

మొహమ్మద్ యూసుఫ్: నిన్న (ఆదివారం) శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఇరు దేశాలు ఎప్పటికీ మర్చిపోలేవు. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమి ఆ దేశస్థులను తీవ్రంగా కలిచివేసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రపంచానికి భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న అసలు తేడాను మరోసారి చూపించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపై ఆ దేశ లెజెండరీ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్ తీవ్రంగా విమర్శించాడు. సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.. “రాజకీయ ప్రభావం, వ్యక్తిగత అజెండాలు తొలగించకపోతే పాకిస్థాన్‌ మళ్లీ పుంజుకోదు. ఇది మన క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి కాలం” అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అర్హత లేని వ్యక్తులు పదవుల్లో ఉంటే జట్టు ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై పరోక్ష విమర్శలు చేశాడు.

మరింత చదవండి: Trisha vs Nayinar Nagendran: త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత నాగేంద్రన్

వాస్తవానికీ.. నఖ్శీ నిర్ణయాలు ఎప్పటినుంచో రాజకీయ రంగు పులుముకున్నవేనని విమర్శలు వచ్చాయి. ఆసియా కప్ 2025 సమయంలో భారత్ అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ట్రోఫీని స్టేజ్ నుంచి తీసుకెళ్లడం పెద్ద వివాదంగా మారింది. ఇలాంటి దిక్కుమాలిన పని చేసినందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అతడిని సత్కరించడం మరింత చర్చకు దారి తీసింది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్‌తో మ్యాచ్ బహిష్కరించాలనే ఆలోచన వచ్చింది. ఇందుకు నఖ్వీ పాకిస్థాన్‌ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌తో సమావేశం ఏర్పాటు చేశాడు. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించాని ప్రధానిని ఒప్పించినట్లు తెలిసింది. తర్వాత ఐసీసీ అధికారులతో చర్చలు జరగక ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. ఈ సంఘటన క్రికెట్ కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించింది. ఈ బహిష్కరణ డ్రామా జట్టుపై ప్రభావం చూపిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇలాంటి అంశాలు రావడం వల్లే కొలంబోలో భారత్ చేతిలో పాకిస్థాన్‌ అవమానకర ఓటమి చవిచూసిందని అభిప్రాయాలు ఉన్నాయి.





Source link

Spread the love