icc mens t20 world cup 2026 వీక్షకుల రికార్డులను బద్దలు కొట్టింది, భారతదేశంలో 500 మిలియన్ల వీక్షకులను దాటింది | సౌజన్యం – ICC
ఫోటో: ట్విట్టర్
ఇండియా, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వరుసగా ఆరేళ్లుగా ఏటా ఓ ఐసీసీ టోర్నీ నిర్వహిస్తూ వస్తోంది ఐసీసీ. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇప్పుడు మళ్లీ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఆధీనంలో ఉంది. ఇలా ప్రతీ ఏటా ఓ ఐసీసీ టోర్నీ నిర్వహించడం వల్ల జనాలు బోర్ ఫీల్ అవుతారనే విమర్శలు వచ్చాయి. వచ్చే ఏడాది వరల్డ్ కప్ 2027 టోర్నీ కూడా జరగనుంది.
కాబట్టి ఇకనైనా టీ20 వరల్డ్ కప్ టోర్నీలకు కూడా రెండేళ్లు కాకుండా నాలుగేళ్లకోసారి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సలహాలు వచ్చాయి. అయతే జనాలు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీకి ఇప్పటికే ఇండియాలో 500 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ఎడిషన్‌గా నిలిచింది 2026 టీ20 వరల్డ్ కప్.
‘క్రికెట్‌ని విశ్వవ్యాప్తం చేయాలనే సంక్పలంతో టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ మొదలైంది ఈ టోర్నీ ఇప్పటికే కేవలం ఇండియాలోనే 500 మిలియన్ వ్యూస్ సాధించిందనే విషయాన్ని సగర్వంగా తెలియచేస్తున్నా. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే కొత్త రికార్డు. జియ్‌హాట్‌స్టార్‌లో పీక్ 60.5 మిలియన్ రియల్ టైమ్ నమోదు కావడం మరింత సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇదే ఉత్సాహంతో రికార్డు బ్రేక్ చేస్తారని నమ్ముతున్నాం..’ అంటూ ట్వీట్ చేశాడు ఐసీసీ ప్రెసిడెంట్ జై షా.
ఫ్రిబవరి 7న 20 జట్లతో మొదలైంది ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ. గ్రూప్ స్టేజీ నుంచి 12 జట్లు నిష్కమించాయి. ఆస్ట్రేలియా వంటి టాప్ టీమ్, సూపర్ 8 కూడా రాకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే అసోసియేట్ దేశాల జట్లు, టాప్ టీమ్స్‌కి చుక్కలు చూపించాయి. పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్, ఇండియా వర్సెస్ యూఎస్‌ఏ మధ్య మ్యాచులు ఆఖరి వరకూ ఆసక్తికరంగా సాగాయి. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కంటే, ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌కి భారీ వ్యూయర్‌షిప్ దక్కింది.