Telangana | ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలంలో గిరిజన మహిళ తన పుత్రుడిని రూ.1.7 లక్షలకు అమ్మేసిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత నెల 10న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ, డబ్బుల కోసం నెల రోజులకే బిడ్డను కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులకు అమ్మేసింది.
అంగన్‌వాడీ కేంద్రం నుంచి గుడ్లు, ఆహారం తీసుకోవడానికి ఆమె రాకపోవడంతో అంగన్‌వాడీ టీచర్ ఇంటికి వెళ్లి తనిఖీ చేసింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చి ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణలో ఐసీడీఎస్ అధికారులు ఆ గిరిజన దంపతులను మరో గ్రామంలో గుర్తించి పట్టుకున్నారు. ప్రశ్నించగా బిడ్డను రూ.1.7 లక్షలకు అమ్మేసినట్లు వారు వెల్లడించారు. దీంతో వారిని తీసుకెళ్లి హవేలీఘనాపూర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.