Telangana Governor: తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణం |


తెలంగాణ రాష్ట్రానికి ఇక కొత్త గవర్నర్ వచ్చేశారు. ఉదయం 11.30కి శివ ప్రతాప్ శుక్లా.. తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. పదవీ బాధ్యతలు తీసుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రమాణం చేయించారు. గవర్నర్ తెలుగులో ప్రమాణం చెయ్యడం గొప్ప విషయం. లోక్ భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ హాజరయ్యారు.

ఇవాళ ఏమున్నాయి?

ఇరాన్ యుద్ధానికి 11 రోజులు పూర్తయ్యాయి. ఇవాళ 12వ రోజు. నేడు తమిళనాడులో ప్రధాని మోదీ టూర్ ఉంది. 2 అమృత్ భారత్, 2 ఎక్స్‌ప్రెస్, ఒక ప్యాసింజర్ రైలును ప్రారంభిస్తారు. నేడు నాగర్ కోయిల్, చర్లపల్లి అమృత భారత్ ఎక్స్‌ప్రెస్‌ని తమిళనాడులో ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. ఏపీలో నేడు, రేపు సచివాలయంలో సీఎం చంద్రబాబు ద్వారా కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టబోతున్నారు. తెలంగాణ కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు తీసుకుంటారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో నేడు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇస్తారు. నేడు ఖమ్మంలో 311 మంది బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వనుంది. బహ్రెయిన్ లోని 600 మంది తెలుగు ప్రజల తరలింపు కొనసాగుతోంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love